ఎలతుర్తి, జూలై 8: బీఅర్ఎస్ రజతోత్సవ సభ కోసం హనుమకొండ జిల్లా ఎలతుర్తిలో రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన భూములను తిరి గి యథావిధిగా వారికి నాయకులు అప్పగించా రు. సభకు ముందు కొందరు వ్యక్తులు భూము ల హద్దులు చెడకొడుతున్నారని రాద్ధాంతం చే సిన విషయం తెలిసిందే. దీంతో సభ ఇన్చార్జిలుగా ఉన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాసర్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తకళ్లపల్లి రవీందర్రావు, పార్టీ ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, మాజీ ఎమ్మెల్యే లు వొడితల సతీశ్‌కుమార్, పెద్దిసుదర్శన్‌రెడ్డి రైతులతో మాట్లాడి భూములు ఉన్నవి ఉన్నట్లు గా అప్పగిస్తామని అప్పుడు హామీ ఇచ్చారు.
స ర్వేయర్తో డిజిటల్ హద్దులు నిర్ణయించారు. సభ అనంతరం యథావిధిగా హద్దులు పెట్టి ఎ వరి భూములు వారికి అప్పగించారు. సుమా రు 1,200 ఎకరాల్లో పోసిన మొరం, కంకర తదితర వాటిని తొలగించి భూమిని చదును చేసి రైతులకు అప్పగించారు. ఎలాంటి ఇబ్బందులు, గొడవలు లేకుండా భూములు తమకు అప్పగించడంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వానకాలం ప్రారంభం కావడంతో ఆ భూముల్లో పంటలు సాగు చేసుకుంటున్నారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం మా భూములను స్వచ్ఛందంగా ఇచ్చాం. సభ జరిగిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు దగ్గరుండి తొక్కుడు పడిన భూమిని ట్రాక్టర్‌తో దున్నించి చదును చేసి ఇచ్చారు. పొలాల్లో పోసిన మొరం, కంకర తీసివేశారు. పాత భూమి లాగే హద్దులు పెట్టి మాది మాకు అప్పగించారు. – డుకిరే రాజేశ్వర్‌రావు, రైతు