ఖాజీపేట : రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబును హైదరాబాద్ మినిష్టర్స్ క్వార్టర్స్‌లో తెలంగాణ రైల్వే జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్ ఆధ్వర్యంలో శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాఘవేందర్ మాట్లాడుతూ.. కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు సందర్శించి స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా చూడాలని కోరారు.
ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుద్యోగులకు వీలైనంత సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. అదే విదంగా స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడి తప్పకుండా ఖాజిపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, మడికొండ ఇండ్ర స్ట్రీయల్ ప్రాంతాన్ని సందర్శిస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైల్వే జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.