కాజీపేట, నవంబర్ 2 : సికింద్రాబాద్- వరంగల్- సికింద్రాబాద్ మధ్య ప్రతి రోజు మధ్యాహ్నం పుష్పుల్ రైలును శనివారం నుంచి నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. గతంలో కరోనా వల్ల కాజీపేట- సికింద్రాబాద్, సికింద్రాబాద్- వరంగల్, వరంగల్-సికింద్రాబాద్, సికింద్రాబాద్- కాజీపేట మధ్య నడిచే పుష్పుల్ రైళ్లను రద్దు చేసింది. వరంగల్ ప్రజల విజ్ఞప్తి మేరకు రైల్వే అధికారులు ఈ పుష్పుల్ రైలును తిరిగి నడిపిస్తున్నట్లు తెలిపారు.
ఈ రైలు సికింద్రాబాద్‌లో 07462 నంబర్‌తో ప్రతిరోజు ఉదయం 9.35 గంటలకు బయలుదేరి వరంగల్‌కు మధ్యాహ్నం 1.15 గంటలకు చేరుకుంటుంది. తిరిగి 07463 నంబర్‌తో మధ్యాహ్నం 1.45 గంటలకు వరంగల్ నుంచి బయలుదేరి, సికింద్రాబాద్‌కు సాయంత్రం 5.55 గంటలకు చేరుకుంటుందన్నారు. ఈ పుష్పుల్ ఇప్పటి నుంచి యధాతథంగా నడుస్తుందని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.