హనుమకొండ, అక్టోబర్ 19: వరంగల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా సీఐ పుల్యాల కిషన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం హనుమకొండలో తెలంగాణ అథ్లెటిక్స్అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి అధ్యక్షతన ఎన్నికలు, జనరల్ బాడీసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా అథ్లెటిక్స్అసోసియేషన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
చీఫ్ పాటర్గా గట్టు మహేష్‌బాబు, చైర్మన్‌గా షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్‌యాదవ్, అధ్యక్షుడిగా సీఐ పుల్యాల కిషన్, వైస్ ప్రెసిడెంట్స్‌గా పి.అశోక్, ఎన్.రాఘవేందర్‌రెడ్డి, సెక్రటరీగా రెండోసారి యు.యుగేందర్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా బి.కృష్ణమూర్తి, పి.మహేందర్, ఈ.లక్ష్మణ్, ఎం.నరేష్, ట్రెజరర్‌గా వి.నిషాంత్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌గా జే.శ్రీశైలం, ఎన్.రాజు, ఎల్.సున్నిత్కుమార్, కె.నరేష్, జే.సురేష్, జే.శ్రీనాథ్, కోకిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రిటర్నింగ్ ఆఫీసర్ జే.సత్యపాల్‌రావు వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని తెలంగాణ అథ్లెటిక్స్అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, రాష్ట్ర సభ్యుడు పగిడిపాటి వెంకటేశ్వర్‌రెడ్డి, కోచ్‌లు శ్రీమన్, నాగరాజు ఘనంగా సన్మానించి అభినందించారు.