హనుమకొండ రస్తా, అక్టోబర్ 12 : నిండు జీవితానికి రెండు చుక్కలు, పోలియో రహిత భారతదేశానికి పాటుపడదామని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కోఆర్డినేటర్ పులి రజనీకాంత్ అన్నారు. హనుమకొండ 10వ డివిజన్ మచిలీబజార్ ప్రాంతంలో పోలియో చుక్కల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 0 నుంచి 5 ఏళ్లలోపు పిల్లలు ప్రతి ఒక్కరికి పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులను కోరారు.
పోలియో చుక్కలను పిల్లలకు వేయించడం ద్వారా వారిలో అంగవైకల్యం సంభవించే ప్రమాదాన్ని అరికట్టవచ్చన్నారు. పోలియో రైత భారతదేశానికి కృషి చేస్తున్న అంగన్వాడీ, ఆశ, వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పొదిలి అనిల్‌కుమార్, నెల్లుట్ల సారంగం, కొనుకుంట్ల శ్రీను, మచిలీబజార్ అంగన్వాడీ టీచర్ సుష్మచంద్ర, ఆర్పీ బి.కవిత, జయ కాలేజ్ స్టూడెంట్స్ వైష్ణవి, సుస్మిత, ముంతాజ్ ఉన్నారు.