రాయపర్తి, డిసెంబర్ 17 : మూడు నెలలకోసారి నిర్వహించే మండల సర్వ సభ్య సమావేశం శుక్రవారం మొక్కుబడిగా సాగింది. ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి సారథ్యంలో ఎంపీడీవో గుగులోత్ కిషన్‌నాయక్ సమక్షంలో జరిగిన మండల సభను తూతూ మంత్రంగా నిర్వహించారు. పలు శాఖల అధికారులు తమ నివేదికలను వినిపిస్తున్న సమయంలో మండలంలోని కొండాపురం, బురహాన్‌పల్లి, రాయపర్తి, రాగన్నగూడెం,జయరాంతండ(ఎస్) గ్రామాల సర్పంచ్‌లు కోదాటి దయాకర్‌రావు, సూదుల దేవేందర్‌రావు, గారె నర్సయ్య, రెంటాల గోవర్దన్‌రెడ్డి, బానోత్ పద్మ రవినాయక్, కొండూరు, మొరిపిరాల,మైలారం గ్రామాలకు చెందిన ఎంపీటీసీలు చిర్ర ఉపేంద్ర, భూక్యా క్రాంతి, గాడిపల్లి వెంకటయ్య వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండాపురంలో జడ్పీ, మండల పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండేందుకు మహిళా సంఘాలు ముందుకు రావడం లేదని చెప్పారు. విద్యుత్ శాఖ ఉద్యోగులు, సిబ్బంది అందుబాటులో ఉండడం లేదని, ఈ విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోవడం లేదని సదరు సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో జడ్పీటీసీ రంగు కుమార్, తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ, అధికారులు శేషం కిరణ్‌కుమార్, తుల రామ్మోహన్, డాక్టర్ వీరగోని శృతి, డాక్టర్ భూక్యా వెంకటేశ్, ఏపీఎం పులుసు అశోక్‌కుమార్, ఐసీడీఎస్ సీడీపీవో శ్రీదేవి, సూపర్వైజర్ సత్యవతి, దేవీప్రసాద్, విల్సన్, డీఈ జీవన్ప్రకాశ్, ఏఈలు శివప్రసాద్, బాలదాసు, ఆకారపు అజయ్‌కుమార్, బానోత్ రాజశేఖర్, ఎంఈవో నోముల రంగయ్య, ఏవో గుమ్మడి వీరభద్రం, ఏపీవో దొణికెల కుమార్‌గౌడ్, ఉద్యాన అధికారి యమున, సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు.