ఖిలావరంగల్, నవంబర్ 16: కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాలని, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ వద్దన్న హస్తం పార్టీని ప్రజలు తిరస్కరించాలని బీఆర్ఎస్ వరంగల్ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పిలుపునిచ్చారు. గ్రేటర్ వరంగల్ 35వ డివిజన్ శివనగర్‌లో గురువారం కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో నన్నపునేనికి ఎదురేగి బొట్టుపెట్టి ఆశీర్వదించారు. ప్రజలు అడుగడుగునా అపూర్వస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీకి ఓటు వేస్తే వరంగల్ తూర్పు నియోజకవర్గం అభివృద్ధిలో 50 ఏండ్లు వెనక్కి వెళ్తుందన్నారు. తనకు రాజకీయ జీవితాన్నిచ్చిన శివనగర్ ముంపునకు శాశ్వత పరిష్కారం చూపించామన్నారు. తూర్పు నియోజకవర్గ రూపురేఖలు మార్చివేశానని, మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. ప్రజా ఆశీర్వాదమే తనకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తున్నదన్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు అధికార దాహం తప్ప అభివృద్ధిపై ధ్యాస లేదని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దోనపూరి రమేశ్‌బాబు, డివిజన్ అధ్యక్షుడు కానుగంటి స్వామి, మేరుగు అశోక్, గడ్డం రవి, శ్రీరాం రాజేశ్‌తోపాటు కార్పొరేటర్లు, ఇన్చార్జీలు పాల్గొన్నారు.
గిర్మాజీపేట: తనపై నమ్మకంతో పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తనూ కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపునేని నరేందర్ అన్నారు. 42వ డివిజన్ కార్పొరేటర్ గుండు చందనా పూర్ణచందర్ ఆధ్వర్యంలో గురువారం డివిజన్‌కు చెందిన కత్తెరపల్లి వేణుతోపాటు వారి బృందం 30 మంది శివనగర్‌లో ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరుతామన్నారు.
కాశీబుగ్గ: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మరోసారి గులాబీ జెండాను ఎగురవేసేందుకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో సైనికుల్లా పని చేద్దామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పిలుపునిచ్చారు. 18వ డివిజన్ లేబర్‌కాలనీలో బుధవారం రాత్రి తాండ్ర భాస్కర్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పు కార్యకర్తలు క్రమశిక్షణతో పని చేయాలన్నారు. ప్రతిపక్షాల విమర్శలు, కల్లబొల్లి మాటలను వెంటనే తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎండగట్టాలని కోరారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, పార్టీ రాష్ట్ర నాయకుడు అచ్చ విద్యాసాగర్, జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు కోరబోయిన విజయ్, కార్పొరేటర్ బాబు, మాజీ కార్పొరేటర్ రాజేందర్, తాళ్ల ఉమాదేవి, సీబీ చర్చి ప్రెసిడెంట్ పీఆర్ సల్మాన్, కుమార్ పాల్గొన్నారు.
పోచమ్మమైదాన్: బీఆర్ఎస్ వరంగల్ తూర్పు అభ్యర్థి నన్నపునేని నరేందర్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆర్యవైశ్య సంఘం పెద్దలు తెలిపారు. మట్టెవాడ వేణుగోపాలస్వామి ఆలయ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గురువారం సమావేశం ఏర్పాటు చేసి మూకుమ్మడిగా మద్దతు ప్రకటించారు. ఈ నెల 30న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ను బలపరుస్తూ.. కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా నరేందర్‌ను గెలిపిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్యవైశ్య సంఘం పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
గిర్మాజీపేట: బీఆర్ఎస్ తూర్పు అభ్యర్థి నన్నపునేని నరేందర్‌కు రోజురోజుకూ మద్దతు పెరుగుతున్నది. గురువారం 26వ డివిజన్లోని ప్రింటర్స్ అసోసియేషన్, మార్కండేయ సేవా సంఘం సభ్యులు మూకుమ్మడిగా బీఆర్ఎస్లో చేరి నరేందర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అనంతరం ఆమోద పత్రాన్ని నరేందర్‌కు ఆందజేశారు. ప్రింటర్స్ అసోసియేషన్ వారికి 100 గజాల స్థలంతోపాటు భవనానికి నిధులు కేటాయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రింటర్స్ అసోసియేషన్, మార్కండేయ సేవా సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బాలిన సురేశ్, ఎన్నికల ఇన్చార్జి కూచన రమేశ్, ఎలకంటి సతీశ్, కూచన క్రాంతి, ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంగల భానుమూర్తి, మార్కండేయ సేవా సంఘం అధ్యక్షుడు ఆదినారాయణ, వెంగరి ప్రదీప్, కూచన శ్రీకాంత్, కోడెం యుగేంధర్, మాచబత్తుల రాజ్‌కుమార్, పాషికంటి రవీందర్, కృష్ణ, సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.
గిర్మాజీపేట: ‘తూర్పు నియోజకవర్గం అభివృద్ధికి పట్టం కట్టండి.. చేసిన అభివృద్ధి చెప్పుకొని ఓట్లు అడిగే దమ్ము నాకే ఉంది. నియోజకవర్గ ప్రజలకు ఏమీ చేయని కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఓట్లు అడిగే అవకాశమే లేదు’ అని ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపునేని నరేందర్ అన్నారు. గురువారం రాత్రి ఆయన నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్‌తో కలిసి 26వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఆపదొచ్చినప్పుడు కానరాని నాయకులు ఇప్పుడొచ్చి ఓట్లు అడిగితే ప్రజలు తిరస్కరిస్తారన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్పొరేటర్ బాలిన సురేశ్, బీఆర్ఎస్ నేత షమీమ్ మసూద్ పాల్గొన్నారు.