నెక్కొండ, డిసెంబర్ 17 : మండలంలోని చిన్నకొర్పోలు గ్రామానికి చెందిన తొగరు యాకయ్య శుక్రవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న గ్రామానికి వెళ్లి మృతుడి కుటుంబానికి పరార్శించి రూ.10వేల ఆర్థికసాయం అందజేశారు. టీఆర్ఎస్ నాయకుడు బాషబోయిన శ్రీను కుటుంబ సభ్యులను పరామర్శించి రూ. 5వేల ఆర్థికసాయం అందజేశారు. ఆమె వెంట ఎంపీపీ జాటోత్ రమేశ్ నాయక్, జడ్పీటీసీ లావుడ్యా సరోజన హరికిషన్, సొసైటీ చైర్మన్ మారం రాము, సర్పంచ్ కర్ర వెంకట్‌రెడ్డి, నాయకులు తాటిపెల్లి శివకుమార్ పాల్గొన్నారు.
మృతుడి కుటుంబానికి పరామర్శ
మండలంలోని మహేశ్వరం గ్రామానికి చెందిన గుండె సురేశ్(26) శుక్రవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎంపీపీ మోతె కళావతి, టీఆర్ఎస్ నాయకులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. అదేవిధంగా జడ్పీటీసీ కోమాండ్ల జయ మృతుడి కుటుంబానికి రూ.2 వేల ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మోతె పద్మనాభరెడ్డి, కోమాండ్ల గోపాల్‌రెడ్డి, ఆర్ఎస్ఎస్ కన్వీనర్ మోతె జయపాల్‌రెడ్డి, ముస్కుల దేవేందర్, పిన్నింటి దేవేందర్‌రెడ్డి, మచ్చిక రాజుగౌడ్, చేరాల గోవర్దన్ పాల్గొన్నారు.
బియ్యం అందజేత
మండలంలోని ముగ్ధుంపురం గ్రామంలో మృతురాలి కుటుంబానికి పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు క్వింటా బియ్యం అందజేశారు. ముగ్ధుంపురం గ్రామానికి చెందిన గొర్రె కట్టమ్మ ఇటీవల మృతి చెందింది. మృతురాలి కుటుంబాన్ని సర్పంచ్ పెండ్యాల జ్యోతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, మండల బీసీ సెల్ అధ్యక్షుడు పెండ్యాల సదానందం పరామర్శించి బియ్యం అందజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ చాందావత్ తిరుపతినాయక్, టీఆర్ఎస్ మండల నాయకులు రాజన్న, పెండ్యాల ప్రభాకర్, భిక్షపతి, రవి, వేల్పుల మధూకర్, రవి, నర్సయ్య, సాయిబాబు, రాజగౌడ్, ఆకులపెల్లి మల్లేశం, కొంరయ్య, బాబు, మార్కండేయ పాల్గొన్నారు.