జనగామ రైతులకు దేవాదుల నీళ్లివ్వండి..
జనగామ రైతులకు సాగునీరు, భూసేకరణ, కాల్వల నిర్మా ణం, చివరి ఆయకట్టుకు నీ టి అందుబాటు వంటి అం శాలపై ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి సమగ్ర వినతిపత్రం అందజేశారు. దేవాదుల ప్రాజెక్టు పురోగతిపై శనివారం హైదరాబాద్‌లో మంత్రులు సీత క,
- చివరి ఆయకట్టుకు గోదావరి జలాలు ఇవ్వాలి
- అసంపూర్తి కాలువ పనులు పూర్తి చేయండి
- హైదరాబాద్‌లో దేవాదుల సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రస్తావన
- చెక్‌డ్యామ్‌లు, పెండింగ్ పనులపై వినతిపత్రం
- అడ్డంకులు తొలగిస్తామని హామీ ఇచ్చిన మంత్రి
జనగామ, మే 16 (నమస్తే తెలంగాణ): జనగామ రైతులకు సాగునీరు, భూసేకరణ, కాల్వల నిర్మా ణం, చివరి ఆయకట్టుకు నీ టి అందుబాటు వంటి అం శాలపై ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి సమగ్ర వినతిపత్రం అందజేశారు. దేవాదుల ప్రాజెక్టు పురోగతిపై శనివారం హైదరాబాద్‌లో మంత్రులు సీత క, పొన్నం ప్రభాకర్, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో జనగామ ప్రాంతం లో అసంపూర్తి కాల్వ పనులు పూర్తి చేయాల ని, దేవాదుల ప్రాజెక్టు ఫేజ్-3 పరిధిలోని ప్యాకేజీ-8 కింద ఉన్న తపాస్‌పల్లి, కన్నెబోయినగూడెం రిజర్వాయర్ల పరిధిలో నిలిచిన కాల్వల నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రస్తావించారు. పనులను తక్షణమే పునఃప్రారంభించి నిర్ధిష్ట గడువులో పూర్తి చేసి, భూసేకరణ పరిహారం వెంటనే విడుదల చేయాలని కోరారు. కాల్వలు, రిజర్వాయర్ల నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ పూర్తిస్థాయి పరిహారం అందలేదని ఎమ్మెల్యే, నిధుల విడుదల్లో జాప్యం వల్ల రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురొంటున్నారని చెప్పారు.
చివరి ఎకరాకు నీరు అందించాలి..
జనగామ ప్రాంతంలోని ప్రతి గ్రామానికి, ముఖ్యంగా చివరి ఆయకట్టులోని భూముల కు కూడా గోదావరి నీరు చేరేలా కాల్వల పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరారు. మధ్యలో పనులు నిలిచిపోవడం వల్ల కొద్ది వరకే నీరు చేరుతుందని, చివరి ప్రాంత రైతు లు నష్టపోతున్నారని వివరించారు. నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో బొమ్మకూరు కుడి కాల్వ ద్వారా సాగునీరు సక్రమంగా అందడం లేదని, కాల్వలో సాంకేతిక లోపా లు, నిర్వహణ సమస్యల కారణంగా రైతులకు నష్టం జరుగుతున్న దృష్ట్యా సమస్యను శాశ్వతంగా పరిషరించాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. లింగాపూర్ పెద్దవాగుపై చెక్ డ్యామ్ పునరుద్ధరణకు రూ.3.39కోట్లు, కొత్త దొమ్మాట కొత్త చెక్‌డ్యామ్‌కు రూ.2.80 కోట్లు, ధూల్మిట్ట చెక్‌డ్యామ్‌కు రూ.4.26 కోట్లు గతంలోనే మంజూరైనా పనులు ప్రా రంభం కాలేదని సమీక్షలో మంత్రుల దృష్టికి తెచ్చారు. దేవాదుల ద్వారా ప్రతి గ్రామానికి, ప్రతి రైతు పొలానికి నీరు చేరే వరకు తన పోరాటం కొనసాగుతుందని జనగామ ఎ మ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమీక్షలో స్పష్టం చేశారు. భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరగాలని, పెండింగ్ పరిహారం వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సానుకూలంగా స్పందించిన మంత్రి ఉత్తమ్
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి లేవనెత్తిన జనగామ ప్రాంత అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. ప్యాకేజీల వారీగా పెండింగ్ పనులపై సమీక్ష నిర్వహించి అడ్డంకులను తొలగిస్తామని, భూసేకరణ పరిహారం విడుదలకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, అసంపూర్తిగా ఉన్న పనులను త్వరగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. చెక్‌డ్యామ్ ప్రతిపాదనలపై సాంకేతిక పరిశీలన పూర్తి చేసి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారని పేర్కొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

