హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 25 : మండల్ కమిషన్(Mandal Commission) సిఫారసులతోనే ఇతర వెనకబడిన తరగతులకు కేంద్ర విద్యా, ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయని యూనివర్సిటీ ఆర్ట్స్కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకర జ్యోతి అన్నారు. డాక్టర్ తిరునహరి శేషు ఆధ్వర్యంలో ఆర్ట్స్కాలేజీలో జరిగిన బీపీ మండల్ 107వ జయంతి కార్యక్రమంలో ప్రొఫెసర్ జ్యోతి మాట్లాడుతూ.. రెండవ వెనుకబడిన తరగతుల చైర్మన్గా మండల్ కమిషన్ సిఫారసుల మేరకే ఓబీసీలకి కేంద్ర విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్లు సాధ్యమయ్యా యన్నారు.
మండల్ కమిషన్ సిఫారసుల ప్రకారంగా కేంద్ర విద్యా, ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి. కానీ కేంద్ర విద్యా, ఉద్యోగాలలో ఓబీసీలకు రిజర్వేషన్లు 22 శాతానికి మించి దక్కటంలేదని అభిప్రాయ పడ్డారు. కార్యక్రమంలో బీసీ నాయకులు తండు నాగయ్య, డాక్టర్ ఎర్రబొజ్జు రమేష్, కరుణాకర్, ఫిరోజ్, వెన్నంపల్లి విజయకుమార్, లక్ష్మీనారాయణ, దాసు, శ్రీలత, రమేష్, స్వామి, జయప్రకాశ్, తాళ్లపల్లి సంజీవ్, సదానందం, కొమురయ్య పాల్గొన్నారు.