తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్‌సార్ వర్ధంతిని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వరాష్ట్ర సాధనలో దిక్సూచిగా నిలిచి, ఉద్యమంలో కోట్లాది మందిని కార్యోన్ముఖులను చేసిన మహనీయుడని ఆయన ఆశయాలను కొనసాగిస్తూ తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా పోరాడాలని పలువురు పిలుపునిచ్చారు.
హనుమకొండ బాలసముద్రంలోని జయశంకర్‌సార్ స్మృతి వనం(ఏకశిల పార్కు)లోని నిర్వహించిన 13వ వర్ధంతి కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొని నినాదాలు చేశారు. ఆయాచోట్ల ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
– నమస్తే నెట్వర్క్, జూన్ 21