హనుమకొండ: తలపై రంగు ఎగిరిపోయి, కళ తప్పిన ఈ విగ్రహం హనుమకొండ బాలసముద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్మృతివనంలోనిది. శుక్రవారం ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు వచ్చిన ప్రజలు, నాయకులు విగ్ర హం దుస్థితిని చూసి ఆగ్రహానికి లోనయ్యారు.
విగ్రహంపై రంగు పోయినా పాలకులు, అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా విగ్రహానికి మరమ్మతులు, రంగు వేయాలని కోరారు.