హనుమకొండ, అక్టోబర్ 22: కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్కాలేజీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు నవంబర్ 14వ తేదీ వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరుగనున్నట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి తెలిపారు.
పరీక్షలను పరీక్షా షెడ్యూల్ ప్రకారం ఖచ్చితంగా నిర్వహిస్తున్నామని, విద్యార్థులకు తాగునీటి వసతి, నిరంతర విద్యుత్ సరఫరా వంటి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్పారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రెహమాన్, పరీక్ష పరిశీలకులు మంద శ్రీనివాస్, శ్రీదేవి, అధ్యాపకులు ఉన్నారు.