జీవితాన్ని తీర్చిదిద్దేది స్వయంకృషి, స్వీయ ప్రతిభే..
జీవితాన్ని తీర్చిదిద్దేది స్వయంకృషి, స్వీయ ప్రతిభ అని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూధనాచారి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్యూరులో స్వర్గీయ పుట్ట లింగమ్మ స్మారకార్థం పుట్ట మదన్న ఫ్రెండ్లీ యూత్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంథని నియోజకవర్గ స్థాయి ప్రీమియర్ లీగ్ సీజన్-1 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ జకు శ్రీహర్షిణి రాకేశ్‌తో కలిసి ఆయన విజేతలకు బహుమతులు అందజేశారు.
- క్రీడాకారులు పుట్ట మధు జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
- శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ
- ప్రీమియర్ లీగ్ విజేతలకు బహుమతుల ప్రదానం
మల్హర్, ఏప్రిల్ 8 : జీవితాన్ని తీర్చిదిద్దేది స్వయంకృషి, స్వీయ ప్రతిభ అని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూధనాచారి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్యూరులో స్వర్గీయ పుట్ట లింగమ్మ స్మారకార్థం పుట్ట మదన్న ఫ్రెండ్లీ యూత్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంథని నియోజకవర్గ స్థాయి ప్రీమియర్ లీగ్ సీజన్-1 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ జకు శ్రీహర్షిణి రాకేశ్‌తో కలిసి ఆయన విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు 12 ఏండ్ల నుంచే మధుతో పరిచయమని, అంతకు పదేండ్ల ముందు నుంచే ఆ పేరు తెలుసన్నారు. చారిటబుల్ ట్రస్ట్ తరపున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. గెలుపోటములకు అతీతంగా ప్రజల మధ్య ఉంటూ వారికోసం తపించే నాయకుడన్నారు. క్రీడలు, రాజకీయ రంగాల్లో ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఎదగరని, స్వయంకృషి, స్వీయ ప్రతిభే వారి స్థాయిని పెంచుతుందన్నారు.
ప్రతి క్రీడాకారుడు మధు జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని, తల్లిదండ్రులను గౌరవించాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. టాలెంట్ ఉంటే ప్రపంచాన్ని శాసించే అవకాశాలున్నాయని, క్రీడాకారులు ఆ దిశగా కృషిచేయాలని సిరికొండ ఆకాంక్షించారు. పుట్ట మధు మాట్లాడుతూ 12 టీంలతో పదిహేడు రోజుల పాటు ఐపీఎల్ కు దీటుగా ప్రీమియర్ లీగ్ నిర్వహించారని అన్నారు. టోర్నమెంట్ ను విజయవంతం చేసిన ప్రతి ఒకరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ప్రథమ (రూ. 44,444), ద్వితీయ (రూ. 22,222), తృతీయ (రూ. 11,111) స్థానాల్లో నిలిచిన పుట్ట మదన్న వారియర్స్, ఎంఎస్సార్ లియోస్, రెబల్స్ టీంకు నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు మహేశ్‌రెడ్డి, లక్ష్మణ్‌రావు, శ్రీశైలం యాదవ్, నాగరాజు గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు కుంభం రాఘవరెడ్డి, సర్పంచ్ అజ్మీరా రవీందర్ బాలాజీ, కమాన్‌పూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణ, మంథని నియోజక వర్గ మహిళా అధ్యక్షురాలు గీతాబాయ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

