వాజేడు ఆగస్టు 16 : మండల పరిధిలోని కొంగాల గ్రామానికి చెందిన మొడెం లక్ష్మి(27) విషజ్వరంతో బాధ పడుతూ గురువారం సా యంత్రం మృతి చెందింది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. కొంగాల గ్రామానికి చెందిన మొడెం ప్రసాద్ భార్య లక్ష్మి నిండు గర్భిణిగా ఉన్న క్రమంలో తొమ్మిది రోజుల క్రితం జ్వ రం సోకింది. దీంతో వాజేడులో రెండు రోజు లు వైద్యం పొందింది. జ్వరం తగ్గకపోవడంతో ఏటూరునాగారంలో మరో నాలుగు రోజులు వైద్యం చేయించుకుంది. అయినా జ్వర తీవ్రత తగ్గక పోవడంతో వరంగల్ ఎంజీఎంకు వెళ్లగా అక్కడ రెండు రోజుల పాటు వైద్యులు చికిత్స అందించారు.
అయినా తగ్గకపోవడంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఆమెను అంబులెన్స్‌లో భద్రాచలానికి తరలించారు. లక్ష్మి నిండు గర్భిణి కావడంతో భద్రాచలంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో సిజేరియన్ చేసి బిడ్డను కాపాడారు. చికిత్స పొందుతూ లక్ష్మి మృతి చెందిం ది. కాగా, మోడెం లక్ష్మి మృతితో పుట్టిన బిడ్డ తల్లిప్రేమకు దూ రమైంది. తకువ బరువుతో పుట్టిన బిడ్డకు భద్రాచలం ఏరియా వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. అయితే, జ్వరాలు సోకి వరుసగా మృతి చెందుతుండడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. కొంగాల పంచాయతీ పరిధిలోని జగన్నాథపు రం గ్రామానికి చెందిన బొగ్గుల కాంచన (48) ఇటీవల విషజ్వరంతో భద్రాచలంలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
తాజాగా కొంగాలకు చెందిన లక్ష్మి కూడా మృతి చెందడంతో స్థానికులు ఆందోళన పడుతున్నారు. పక పక గ్రామాల్లో ఇద్దరు విష జ్వరంతో మృతి చెందిన నేపథ్యంలో జ్వరాలపై ఆందోళన నెలకొన్నది. ఈ విషయంపై వాజేడు వైద్యాధికారి మహేందర్‌ను వివరణ కోరగా లక్ష్మి స్థానిక పీహెచ్సీలో చికిత్స తీసుకుంటున్నప్పుడు టైఫాయిడ్ లక్షణాలుండడంతో ఆమెను ఏటూరునాగారం సీహెచ్‌సీకి రెఫర్ చేసి స్వయంగా పర్యవేక్షించినట్లు తెలిపారు. వారి కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు డీఎహెచ్‌వో చొరవతో వరంగల్ ఎంజీఎంకు తరలించినట్లు తెలిపారు. రెండు రోజుల అనంతరం వారు తమ మాట వినకుండా అక్కడి నుంచి భద్రాచలం ప్రైవేట్ వైద్యశాలకు తీసుకొని వెళ్లారని వివరించారు.