హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 18: పారా సిట్టింగ్ వాలీబాల్ వరల్డ్‌కప్‌లో తలపడే భారత జట్టులో తెలంగాణ నుంచి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన గాడిపల్లి ప్రశాంత్ రెండోసారి ఎంపికయ్యారు. అమెరికాలోని ఇండియానా ఫోర్టువేన్లో అక్టోబర్ 8 నుంచి 18 వరకు జరిగే వరల్డ్‌కప్‌లో భారత జట్టులోని 14 మంది టీంలో ప్రశాంత్‌కు స్థానం లభించింది.
పేద కుటుంబానికి చెందిన ప్రశాంత్ పుట్టుకతోనే దివ్యాంగుడై ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. సొంత ఖర్చులతో అమెరికా వెళ్లడానికి అప్పు చేయాల్సి వస్తుందని గాడిపల్లి ప్రశాంత్ తెలిపారు. ప్రభుత్వం గుర్తించి ఆర్థికంగా ఆదుకోవాలని, సహాయం చేసేవారు 90006 83937 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.