Hanumakonda | ‘హలో దళిత చలో ఢిల్లీ’ ని విజయవంతం చేయాలి : ప్రభాకర్ మాదిగ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ దాడికి పాల్పడిన సనాతన మనువాది రాకేష్ కిషోర్‌ని కఠినంగా శిక్షించాలని ప్రభాకర్ మాదిగ అన్నారు.
హనుమకొండ, నవంబర్ 5: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ దాడికి పాల్పడిన సనాతన మనువాది రాకేష్ కిషోర్‌ని కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈనెల 20న జరగబోయే హలో దళిత చలో ఢిల్లీ మహా ధర్నాను జయప్రదం చేయాలని మాదిగ రాజకీయ పోరాట సమితి తెలంగాణ(ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షులు ప్రభాకర్ మాదిగ పిలుపునిచ్చారు. బుధవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గవాయిపై జరిగిన దాడిని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విషయంపై ఎక్స్ ద్వారానే స్పందించారు.
కానీ విచారణ జరపలేదని, రాజ్యాంగ విలువలను కాపాడాలని మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ర్ట ప్రధాన కార్యదర్శి జేరిపోతుల విల్సన్ మాదిగ, రాష్ర్ట ఉపాధ్యక్షుడు చిలువేరు ఆశీర్వాదం మాదిగ, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి ఎడ్ల ఉపేంద్ర మాదిగ, రాష్ర్ట ప్రచార కార్యదర్శి ఎడ్ల సమ్మయ్య మాదిగ, వరంగల్ జిల్లా అధ్యక్షులు దాసరపు సారన్న మాదిగ, మైపాల్ మాదిగ, భూపాల్ మాదిగ, సీనియర్ నాయకులు సింగారపు చిరంజీవి మాదిగ, పెండ్యాల స్వరాజ్, తక్కలపల్లి రాజశేఖర్ మాదిగ, కుమ్మరి నాగేశ్వరరావు మాదిగ, కొమురయ్య, అంబాల ఆనందం, పెండ్యాల శిరీష, కోట శ్యామ్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

