హనుమకొండ చౌరస్తా, జూన్ 17 : పండుగ పూట ముస్లింలకు కరెంట్ కష్టాలు తప్పలేదు. సోమవారం బక్రీద్ సందర్భంగా పిల్లలు, పెద్దలు అంతా కలిసి పండుగ జరుపుకొనేందుకు హనుమకొండలోని పెద్దమ్మగడ్డ ఈద్గా వద్దకు చేరుకున్నారు. ప్రార్థనలు చేస్తుండగా 9.10 గంటలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇబ్బంది పడ్డారు. కరెంట్ వస్తుందేమోనని ఎదురుచూసినా ఎంతకూ రాకపోవడంతో చేసేదేమీలేక జనరేటర్ సమకూర్చుకొని ప్రార్థనలు చేయాల్సి వచ్చింది. ఇలా కరెంట్ కట్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై, ప్రజాప్రతినిధులపై వారు మండిపడ్డారు. గతంలో ఇమామ్లకు కేసీఆర్ ప్రభుత్వం రూ.5 వేలు ఇస్తుండగా కాంగ్రెస్ ప్రభుత్వం రూ.10వేలు ఇస్తానని గద్దెనెక్కి ఇప్పుడు మళ్లీ అవే వేస్తున్నారని, దావత్-ఏ-ఇఫ్తార్ ఇస్తానని, పేద ముస్లింలకు దుస్తుల పంపిణీకి ఎన్నికల కోడ్ ఉందని ఇప్పటివరకు పంపిణీ చేయలేదని బీఆర్ఎస్ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ నయీముద్దీన్ మండిపడ్డారు. మౌలానా మొహమ్మద్ ఖా జా అహ్మద్ మావినుద్దీన్, కమిటీ సభ్యులు మహమ్మద్ నయీముద్దీన్, మహమ్మద్ సలీం, ఖలీల్ అహ్మద్, అజీం, మెయిన్, షకీల్, ఎండీ తోసిఫ్, మహమ్మద్ సక్లెన్, నవీద్, మహమూద్ పాల్గొన్నారు.