బయ్యారం : ఆదివాసీ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్గా మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన పూనెం శ్రీనివాస్ ఎన్నికయ్యారు. రాష్ట్రంలోని సుమారు 15 ఆదివాసీ సంఘాల ప్రతినిధులతో భద్రాచలంలో జరిగిన సమావేశంలో ఎన్నికను నిర్వహించారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడిగా గత పదిహేళ్లుగా ఆదివాసీ హక్కుల కోసం శ్రీనివాస్ అనేక పోరాటాలు నిర్వహించి ఆదివాసుల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నాడు.
అంతేకాకుండా జిల్లాల విభజన, షెడ్యూల్ ఏరియాలో 1/70 యాక్ట్ పకడ్బందీ అమలు, 100% రిజర్వేషన్ల అమలు, ఈఎంఎస్ ఆర్ పాఠశాలలో స్థానికులకు 50% సీట్ల కేటాయింపు వంటి అనేక అంశాలపై పోరాటాలు నిర్వహించి సఫలీకృతం అయ్యాడు. ఈ నేపథ్యంలో ఆదివాసీల సంక్షేమం అభివృద్ధి కృషి కోసం శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నిక పట్ల ఆదివాసీ సంఘాల జేఏసీ మండల చైర్మన్ వర్స ప్రకాష్, వైస్ చైర్మన్ అలెం కృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమంతో పాటు ఆదివాసీ యువకుల ఉపాధి రూపకల్పన కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయనున్నట్లు శ్రీనివాస్ ఈ సందర్భంగా తెలిపారు.