దుగ్గొండి, ఏప్రిల్, 17: బీఆర్ఎస్ పార్టీ ఏప్రిల్ 27 నాటికి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చలో వరంగల్ రజతోత్సవ మహాసభకు మండలం నుండి ప్రజలు ఉప్పెనలా గ్రామాల నుండి తరలిరావాలని నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొన్నం మొగిలి పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి నాచినపల్లి, పొనకల్, బికాజ్పల్లి, చలపర్తి, గ్రామాల్లో బీఆర్ఎస్ కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో పది సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ సస్యశ్యామలంగా వర్ధిల్లిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సుకినే రాజేశ్వరరావు, గుడిపల్లి జనార్దన్ రెడ్డి, మాజీ సర్పంచులు ఓడేటి తిరుపతిరెడ్డి, ముదురుకొల కృష్ణ, గాదం లింగన్న, మాజీ ఎంపిటిసి బండి జగన్, తోటకూరి రాజు, గ్రామ పార్టీ అధ్యక్షులు మర్రి చేరాలు, నర్రా రంగారెడ్డి, యారా శ్రీనివాస్, కొండ్లె శ్యామ్, మండల యూత్ అధ్యక్షులు నగరబోయిన తిరుపతి, సొసైటీ డైరెక్టర్లు నల్ల శ్యాంసుందర్ రెడ్డి, హనుమకొండ బాబు, మెరుగు రాజు, నర్ర రమణారెడ్డి, ఇజ్జగిరి కృష్ణ, జంగా రాజిరెడ్డి, గుండెకారి మలహళ్ రావు, కొండ్లె సతీష్, యూత్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.