అంబేద్కర్ సాక్షిగా అధికారం అండతో దేవరుప్పులలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నిర్బంధం, ఎమ్మెల్యే ఒత్తిడితో పోలీసులు ఓవరాక్షన్ చేయగా ములుగు, మానుకోట జిల్లాకేంద్రాల్లో జయంతి సభ ఏర్పాటుచేయకుండా కనీస ఏర్పాట్లు చేయకపోవడం, కలెక్టర్లు సహా జిల్లా ఉన్నతాధికారులెవరూ హాజరుకాకుండా అవమానాల మధ్య వేడుకలు నిర్వహించారని దళిత సంఘాలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల ప్రొటోకాల్, ఏర్పాట్ల విషయంలో అధికారులు, సంఘాల నాయకుల మధ్య వాగ్వాదం జరుగగా, నిర్వహణ తీరుపై వారు ఆగ్రహం వ్యక్తంచేశారు.
దేవరుప్పుల, ఏప్రిల్ 14 : దేవరుప్పులలోని అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం పోలీసుల నిర్బంధం, ఉద్రిక్తతల నడుమ సాగింది. ఉదయం నుంచే జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్, వర్ధన్నపేట ఏసీపీ నర్స య్య, పాలకుర్తి సీఐ మహేందర్‌రెడ్డి వందలాది మంది పోలీసులు ప్రొటోకాల్ పేర అంబేద్కర్ చౌరస్తాలో మోహరించారు. రోడ్డుపై నెలకొల్పిన ఈ విగ్రహ ఆవిష్కరణకు ప్రొటోకాల్ ఉంటుందని, స్థానిక ఎమ్మెల్యే యశస్వినీరెడ్డిని పిలువాలని, ఎర్రబెల్లితో విగ్రహాన్ని ప్రారంభిస్తే నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందని విగ్రహ కమిటీకి తెలిపారు.
ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న ఎర్రబెల్లి మెట్ల మీద నుంచి విగ్రహం వద్దకు వెళ్లేందుకు పోలీసుల అడ్డుకోగా బీఆర్ఎస్ కార్యకర్తలు అమాంతం ఎత్తుకుని పైకి తీసుకెళ్లారు. విగ్రహ ప్రతిష్టాపన కమిటీ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించగా, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పూలమాల వేసి నివాళులర్పించారు. దేవరుప్పులకు చెందిన బీఆర్ఎస్ పార్టీ దళిత కమిటీ రూ.12 లక్షల ఖర్చుతో ఈ విగ్రహాన్ని రెండేండ్ల కింద ఏర్పాటు చేసింది.
ఇందులో రూ.8 లక్షల వ్యయంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి కాంస్య విగ్రహాన్ని సమకూర్చారు. ఇతర దాతలతో విగ్రహ ఏర్పాటును పూర్తి చేశారు. ఎన్నికల కోడ్, ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్నారన్న కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులతో ఆవిష్కరణ వాయిదాపడుతూ వస్తున్నది. జయంతి రోజు సోమవారం విగ్రహాన్ని ఎర్రబెల్లితో ప్రారంభించాలని విగ్రహ కమిటీ నిర్ణయించగా, ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి ప్రొటోకాల్ నిబంధన ముందుకు తెచ్చి, ఇటు రెవెన్యూ, అటు పోలీసులపై ఒత్తిడి తేవడం వివాదానికి దారితీసింది.
ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు : మాజీ మంత్రి ఎర్రబెల్లి
దేవరుప్పులలో విగ్రహ కమిటీ తనను ఆహ్వానిస్తే పోలీసులు అడ్డుకోవడం విడ్డూరంగా ఉంది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలిపెట్టు. ఎమ్మె ల్యే మాటలు విని పోలీసులు ఇంత నిర్బంధాన్ని ఏర్పాటు చేయడమేమిటి? ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి పదవి చేసిన తనను పోలీసులు బలవంంతగా నెట్టివేస్తున్నారు.
ఈ టార్చర్ తాను ఎన్నడూ చూడలేదు. పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారు. ఏసీపీ మాటను తాను జవదాటలే. వాళ్లు చెప్పినట్టే నడుచుకున్నా. ఇదెక్కడి పద్ధతి. పాలకుర్తి సీఐ మహేందర్‌రెడ్డి కాంగ్రెస్ ఏజెంట్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటికే దేవరుప్పుల మండలంలో అనేక మంది బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టారు. జైళ్లకు పంపారు. రాజకీయ అనుభవం లేని వారి మాటలు వింటే మీరే ఆగమవుతారు. నేను మళ్లీ గెలుస్తా.. మంత్రినవుతా. మంత్రిగా ఉన్న సమయంలో రాజకీయ ఒత్తిడి తెచ్చానా. పోలీసుల తీరు మారితే మంచిది. కాంగ్రెస్ సర్కార్‌కు ప్ర జాస్వామ్యంపై, అంబేద్కర్ రాజ్యాంగంపై విశ్వాసం లేదు.
ములుగులో రసాభాస
ములుగు, ఏప్రిల్14(నమస్తే తెలంగాణ) : ములుగు లో అంబేద్కర్ జయంతి కార్యక్రమం రసాభాసగా మారిం ది. అవమానాల మధ్య వేడుకలు జరిపారని, కలెక్టర్ సహా జిల్లా అధికారులు రాకపోవడం, సభ ఏర్పాటు చేయకపోవడంపై దళిత సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశా రు. వివరాల్లోకి వెళ్తే.. ములుగు కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ సంపత్‌రావు ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన వేడుకకు దళిత సంఘాలతో పాటు ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
సరిపడా కుర్చీలు లేకపోవడం, సమావేశ మందిరం అప్పటికే నిండిపోవడంతో లోపలికి అనుమతించలేదు. దీంతో దళిత సంఘాల నాయకులు ఇరుగు పై డి, జన్ను రవి, బుర్రి సతీశ్, నక్క భిక్షపతి, కోగిల మహేశ్, కొట్టెపాక ప్రభాకర్, చంటి భద్రయ్య, మడిపెల్లి శ్యాంబా బు, ప్రజా సంఘాల నాయకుడు ముంజాల భిక్షపతిగౌడ్ మండిపడ్డారు. కలెక్టర్ సహా అధికారులు రాకపోవడం అవమానించడమేనని మండిపడ్డారు. ఇటీవల జరిగిన పూలే, జగ్జీవన్‌రామ్ వేడుకల్లో సైతం కలెక్టర్ పాల్గొనలేదని అసహనం వ్యక్తంచేశారు.
పక్కన ఉన్న భూపాలపల్లి జిల్లా కలెక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేస్తే ములు గు కలెక్టర్ వేయకుండా వెళ్లారని, సీఎం సమావేశం ఉంటే అంబేద్కర్‌ను మరువడం ఏమిటని ప్రశ్నించారు. జయంతికి వాల్‌పోస్టర్ కాని, కరపత్రాలు కానీ ముద్రించలేదని, కేవలం తెల్ల పేపర్‌పై జిరాక్స్‌లు తీసి ఆహ్వాన పత్రాలను పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి సీతక్క నియోజకవర్గంలో ఇలా జరగడం అవమానకరమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చినప్పుడు నిర్లక్ష్యంగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా అదనపు కలెక్టర్ స్పందించి విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
మానుకోటలో ప్రొటోకాల్ వివాదం
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ప్రొటోకాల్, కుర్చీల విషయంలో అధికారులతో వాగ్వా దం జరిగగింది. మొదట ప్రభుత్వ విప్ రామచంద్రు నా యక్, ఎమ్మెల్యే మురళీ నాయక్‌ను ఎస్సీ కార్పొరేషన్ డీడీ స్టేజీ పైకి ఆహ్వానించారు. బహుజనవాది వివేక్‌ను పిలుస్తున్న క్రమంలో దళిత సంఘాల నాయకులు ఆయనకు ఏం ప్రొటోకాల్ ఉన్నదంటూ అభ్యంతరం చెప్పారు. వివేక్‌ను స్టేజీ పైకి పిలువాల్సేందేనని గిరిజన నాయకులు పట్టుబట్టడంతో పిలిచి సమావేశం ప్రారంభించారు.
ఈ క్రమం లో విప్, ఎమ్మెల్యేలు మాట్లాడి వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా సంఘాల నాయకులు తమ సమస్యలు ఎవరు వింటారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం తమకు మాట్లాడే అవకాశం లేదా అని ప్రశ్నించడంతో ఘర్షణ వాతావరణం నెలకొన్నది. ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ సర్ది చెప్పి మాట్లాడే అవకాశం కల్పించా రు. ఉత్సవాలకు కలెక్టర్, అదనపు కలెక్టర్లు సమావేశానికి రాకపోవడంపై ఎల్‌హెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు బోడ రమేశ్‌నాయక్ స్పందించి కలెక్టర్‌ను బదిలీ చేయాలన్నారు. వా రం తర్వాత అన్ని సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై చర్చిస్తామని హామీ ఇచ్చారు.