హనుమకొండ, సెప్టెంబర్ 15 : స్టేషన్‌ఘన్‌పూర్ నియోజక వర్గంలోని రఘునాథపల్లి మండలంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చేపట్టనున్న మూడో విడత పాదయాత్ర నేపథ్యంలో ఉదయం 8 గంటలకే సుబేదారి పోలీసులు హనుమకొండలోని ఆయన ఇంటికి చేరుకొని హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి రాజయ్యకు సంఘీబావం తెలిపారు. అక్రమ హౌస్ అరెస్ట్‌ను మాజీ ప్రజాప్రతినిధులు ఖండించారు.
మధ్నాహ్న పోలీసుల నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత తాటికొండ రాజయ్యను వదలిపెట్టడంతో స్టేషన్ ఘన్‌పుర్ నియోజకవర్గంలోని పాదయాత్రకు బయలుదేరారు. రఘునాథపల్లి మండలం కుర్చపల్లిలో రాజయ్య చేపట్టిన పాదయాత్రకు దాస్యం, నన్నపునేనితో కలిసి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య మాట్లాడుతూ కడియం శ్రీహరి మొగోడైతే రాజీనామా చేసి నిరూపించుకోవాలని అన్నారు. బీఆర్ఎస్ జెండాతో గెలిచిన నీవు సభ్య త్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. పోలీసులను అడ్డుపె ట్టుకొని ఎమర్జెన్సీని తలపించే పరిస్థితులు తీసుకొస్తున్న కడియంను ప్రజలు క్షమించరని అన్నారు.
తన హౌస్ అరెస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి నియంతృత్వ పాలనకు నిదర్శనమని, పాదయా త్ర చేస్తానంటే శ్రీహరికి భయం ఎందుకని, నువ్వు ఏ పార్టీలో ఉన్నావో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి కడియం వెన్నుపోటు పోడుచారని ఆరోపించారు. స్పీకర్ నోటీసులు ఇచ్చినా సమాధానం చెప్పడం లేదని, కాంగ్రెస్ నేతలు సైతం రాజీ నామా చేయాలన్న సిగ్గులేకుండా కొనసాగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసారు.
రైతుల కోసం ఆరు ఎన్ని అడ్డంకులు వచ్చినా పాదయాత్రను కొనసాగిస్తానని, అవసరమైతే ఆమరణ నిరహార దీక్ష చేస్తానని తాటికొండ డాక్టర్ రాజయ్య స్పష్టం చేశారు. కార్యక్రమంలో జనగామ వ్యవసాయ మారెట్ కమిటీ మాజీ చైర్మన్ బాల్నే సిద్ధి లింగం, వైస్ చైర్మన్ ముప్పట్ల విజయ్, కొమరవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్ సంపత్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వారాల రమేశ్, నియోజకవర్గ ఇన్చార్జి వై కుమార్ గౌడ్, మడ్లపల్లి సునీత-రాజు, నాయకులు పెండ్లి మల్లారెడ్డి, బొంగు ఐలయ్య, కొయ్యల స్వామి, గవ్వని నాగేశ్వరరావు, గూడ కిరణ్, కందుకూరి ప్రభాకర్, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
రఘునాథపల్లి : ఊసరవెల్లిలా రంగులు మార్చే కడియం బేషరతుగా రాజీనామా చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నప్పటికీ ఇచ్చిన హామీలను తుంగలో తొకి రైతులకు యూరియా సాగునీరు అందించడంలో విఫలమైంది. రైతుల పక్షాన పోరాడేందుకు పాదయాత్ర చేపట్టిన రాజయ్యను పోలీసులు హౌస్ అరెస్టు చేయడం సరికాదు. శ్రీహరి తన అనుచర గుండాలతో రాజకీయం చేస్తున్నాడని, దాన్ని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి.
బీఆర్ఎస్లో ఉంటూ ఎమ్మెల్యేగా గెలవడానికి డబ్బులు తీసుకొని బిడ్డ భవిష్యత్తు కోసం తల్లిలాంటి పార్టీకి వెన్నపోటు పొడిచి కాంగ్రెస్‌లో చేరడం సిగ్గుచేటు. ఏం తకువైందని కాంగ్రెస్‌లో చేరావు. కడియంకు మొదటి నుంచీ వెన్నపోటు పొడిచే మనస్తత్వం కలవాడు. అందుకే టీడీపీలో ఉండి టిడిపికి, బీఆర్ఎస్లో ఉండి కెసిఆర్‌కు వెన్నుపోటు పొడిచాడు, ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కార్యకర్త లు నాయకులు సిద్ధంగా ఉండాలి. రఘునాథపల్లి మండలంలో పొగాకు పండించే రైతులు ఎకువగా ఉన్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో పొగాకు సబ్బోర్డును ఏర్పాటు చేసేందుకు తన గళాన్ని అసెంబ్లీలో వినిపిస్తా. కుర్చపల్లి ప్రజలకు ఘట్కెసర్లోని నీలిమా ఆస్పత్రిలో ఉచిత వైద్యం చేస్తాం. గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలి.
– జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
కడియం శ్రీహరికి కేసీఆర్ భయంతోనే జ్వరం వచ్చి ఇంట్లో పడుకున్నాడు. 40 ఏళ్ల ఆయన రాజకీ య జీవితంలో అందరినీ విభజించి పాలించాడు. రాజయ్య లాంటి మంచి మనిషిని ఈ రోజు అన్యాయంగా హౌస్ అరెస్ట్ చేయించావు. రేపటి నుండి నియోజకవర్గంలో ఎ లా తిరుగుతావో చూస్తాం. నీ రాజకీయం చివరి దశలో ఉంది. పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎలా తప్పు చేశాబో ను వ్వు కూడా అలానే చేశావ్. రావణాసురుడి నిష్రమణ లాగా ఈ ఉప ఎన్నికల్లో నీ పరిస్థితి ఉండబోతుంది.
-మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్