సుబేదారి, అక్టోబర్ 5 : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొందరు ఖాకీలు తాము ‘ఆడిం దే ఆట పాడిందే పాట’ అన్న చందంగా వ్యవహరించడంతో పాటు నిబంధనలు అతిక్రమించి అతి చేస్తున్నారు. కాసుల కోసం కక్కుర్తి పడి అక్రమ వసూళ్లకు తెగబడుతున్నారు. భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీల ఫిర్యాదులను ఆసరాగా చేసుకొని సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారు. అధికార పార్టీ నేతల సపోర్ట్‌తో పోస్టింగ్‌లు పొందిన కొంతమంది ఇన్స్పెక్టర్లు వారు ఏది చెబితే అదే చేస్తున్నారు. కొందరు పోలీసు అధికారులపై బాధితులు ఫిర్యాదు చేయడం, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు స్పందించి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నారు. అయినా, చాలామంది ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు ఎలాంటి భయం లేకుండా హద్దులు దాటి వ్యవహరిస్తున్నారు. వరంగల్ కమిషనరేట్ పరిధి సెంట్రల్‌జోన్ వరంగల్ డివిజన్లో ఓ ఐపీఎస్ అధికారి ఏఎస్సీగా విధులు నిర్వర్తిస్తున్నా ఇక్కడి ఎస్హెచ్వోల్లో ఎ లాంటి మార్పు రావడం లేదు.
వరంగల్ రేల్వేస్టేష న్ పరిధిలో గంజాయి, బెల్ట్‌షాప్‌ల దందా జోరుగా సాగుతు న్నా ఇక్కడి అధికారికి క నిపించదు. మిల్స్కాల నీ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు ని ర్వర్తించిన శ్రీకాం త్ ఇటీవల అర్ధరాత్రి మద్యం తాగి బిర్యానీ సెంటర్ నిర్వాహకురాలిపై దుసురుగా ప్రవర్తించాడు. ఆమె ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. నిత్యం ఇక్కడ రౌడీషీటర్ల గొడవలు, అల్లర్లు జరుగుతున్నా ఆ స్టేషన్ అధికారులు పట్టిం చుకోకపోవడంతో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతున్నది. ఈ స్టేషన్ పరిధిలో ఓ రౌడీషీటర్ వినాయక నిమజ్జనం రోజు కత్తితో యువకుడిపై దాడి చేశాడు.
మరో పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్, ఎస్సైపై అవినీతి ఆరోపణలతో పాటు కిడ్నా ప్ కేసులో పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారనే వదంతులు వచ్చాయి. ఇదే కాకుండా హత్యాయత్నం, కారు సీజ్ కేసులో ఆ ఎస్సై వాహన యజమాని నుంచి రూ. 60 వేలు బలవంతంగా వసూ లు చేశాడు. ఇదే కాకుండా హంటర్‌రోడ్డులోని 800 గజాల ప్లాట్ వివాదంలో ఆ ఎస్సై తలదూ ర్చి, తనకు 100 గజాలు రిజిస్ట్రేషన్ చేస్తే సెటిల్ చేస్తానని ఇరువర్గాలను బెదిరరించాడు. ఇవే కాకుం డా ప్రతి కేసులో ఆ ఎస్సై, ఇద్దరు సిబ్బందిని అడ్డుపెట్టుకొని వసూళ్లకు పాల్పడ్డారు.
అయితే పోలీస్ ఉన్నతాధికారులు మాత్రం సిబ్బందిని బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు. హనుమకొండ డివిజన్ పరిధిలో ఓ ఇన్స్పెక్టర్ రౌడీ లీడర్‌తో సంబంధాలు పెట్టుకొని సెటిల్మెంట్లకు పాల్పడుతున్నట్లు తెలిసింది. మరో ఇన్స్పెక్టర్ భూ వివాదాల ఫిర్యాదులపై అధికార పార్టీ నేతల ఆదేశాలు పాటిస్తూ బాధితులకు న్యాయం చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాజీపేట డివిజన్లో పనిచేస్తున్న ఇద్దరు ఇన్స్పెక్టర్లపై ఆవినీతి ఆరోపణలు వెల్లువెత్తున్నా చర్యలు తీసుకోవడం లేదు. ములుగురోడ్డు-ములుగు హైవే రోడ్డుకు ఆనుకొని ఉన్న నగర శివారు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్సై ప్రతి కేసులో మధ్యవర్తుల ద్వారా డబ్బులు తీసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల ఓ ట్రాక్టర్ పం చాయతీలో రూ.40వేలు తీసుకున్నట్లు తెలిసింది.
గాంధీ జయంతి రోజు నర్సంపేటలో ఇన్స్పెక్టర్ రఘుపతిరెడ్డి సమక్షంలోనే జంతు బలి చేసిన ఘట న రాష్ట్రవ్యాప్తంగా వివాదాస్పదమైంది. దీనిని నిలువరించాల్సిన సీఐ ప్రోత్సహించడం విమర్శలకు దారితీసింది. ఈ ఘటన జరిగి మూడు రోజులైనా ఎలాంటి చర్యలు లేవు. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని వరంగల్, నర్సంపేట, హనుమకొండ, వర్ధ న్నపేట, మామునూరు డివిజన్ల పరిధిలోని ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఆదేశాల మేరకే పనిచేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
కమిషనరేట్ పరిధిలో కొందరు పోలీసు అధికారులపై బాధితులు ఫిర్యాదు చేస్తేనే ఉన్నతాధికారులు స్పందిస్తున్నారనే విమర్శలున్నాయి. మిల్స్‌కాలనీ ఇన్స్పెక్టర్గా పనిచేసిన వెంకటరత్నం ఓ హత్య కేసులో తనపై అసభ్యకరంగా ప్రవర్తించాడని సదరు మహిళ నిందితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా సస్పెన్సన్ వేటు వేశారు. డబ్బుల వసూళ్లపై కొందరు బాధితులు జఫర్‌గఢ్ ఎస్సై రామ్చరణ్నాయక్పై ఫిర్యాదు చేయగా సస్పెండ్ చేశారు. ఇంకా చాలామంది ఇన్స్పెక్టర్లు, ఎస్సైలపై అనివీతి ఆరోపణలు వచ్చినా రాజకీయ ఒత్తిళ్లతోనే వారిపై చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నా యి. ఇటీవల పోలీసు బాస్ సస్పెన్షన్, బదిలీ వేటు వేసినా, కొందరు ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బందికి భయం లేకుండా పోయింది.