మహబూబాబాద్ రూరల్, డిసెంబర్ 22 : ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసిన ఇద్దరిని పోలీస్‌లు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య కథనం ప్రకారం.. ట్రాన్స్‌కోలో ఉద్యోగాలిప్పిస్తామని రెండు సంవత్సరాల క్రితం స్థానిక నిరుద్యోగులను మభ్యపెట్టి, వారి నుంచి రూ. 1.76 కోట్లు వసూలు చేశారు. అయితే డబ్బులు ఇచ్చిన వారు ఉద్యోగాలివ్వాలని వెంటపడడంతో నిరుద్యోగ అభ్యర్థులకు ఫేక్ అపాయిమెంట్ లెటర్స్‌ను ఇచ్చారు. తీరా అవి చెల్లకపోవడంతో డబ్బులు పో యిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. టౌన్, రూరల్ పోలీసులు కలిసి ఆదివా రం తనిఖీల్లో భాగంగా కురవి మండలం మొ గిలిచర్లకు చెందిన ఇరుకులపాటి నాగేశ్వరరావు, హన్మకొండ జిల్లా శాయంపేటకు చెంది న మండల సహోదర్రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టు లో హాజరుపరిచారు. వీరు జిల్లాలో ఐదు కేసులలో ముద్దాయిలుగా ఉన్నారని, ఈ కేసును పూర్తిగా విచారించి, ఇందులో మిగిలి ఉన్న నిందితులను అరెస్ట్ చేస్తామని సీఐ తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న రూరల్ సీఐ సర్వయ్య, టౌన్ సీఐ దేవేందర్, ఎస్సై దీపిక, విజయ్‌లను ఎస్పీ సుధీర్‌రాంనాథ్ కేకన్ అభినందించారు.
నర్సంపేట : ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగురాలి నుంచి ఓ వ్యక్తి రూ.2.50లక్షలకు టోకరా వేసిన ఘటన నర్సంపేట పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కథనం ప్రకారం.. పట్టణంలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన బుడికొండ శ్రుతి బీకాం కంప్యూటర్ గతంలో పూర్తి చేసింది. ఆమె ఇంటి పక్కనే ఉన్న వావిళ్ల ప్రసాద్‌కుమార్ 13 నెలల క్రితం నర్సంపేట పట్టణంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో స్కానింగ్ సెక్షన్లో ఉద్యోగం ఇప్పిస్తానని శృతికి నమ్మబలికాడు. ఇందుకు రూ.2,50,000లు ఖర్చు అవుతాయని సదరు వ్యక్తి ఆమెతో చెప్పాడు. తప్పకుండా ఉద్యోగం వస్తుంది, పూర్తి బాధ్యత నాదే అని నమ్మకంగా చెప్పగా సదరు మహిళ అతడిని నమ్మి రూ.2,50,000లు ఇచ్చింది. సదరు వ్యక్తి తనకు గత ఏడాది అక్టోబర్ 28న రిపోర్టింగ్ అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇచ్చాడని తెలిపింది. గత సంవత్సరం నవంబర్ 5న ఆఫీస్‌లో ఉద్యోగంలో జాయిన్ అవ్వాలని సదరు వ్యక్తి ఆమెకు చెప్పా డు. ఆ తర్వాత ఆమె సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి అడిగితే అది ఫేక్ అపాయింట్ మెంట్ లెటర్ అని సంబంధిత అధికారులు చెప్పడంతో ఆమె ఖంగుతింది. అప్పటి నుంచి ప్రసాద్‌కుమార్‌ను అడిగితే రేపు, మాపు అంటూ మాట దాట వేశాడని తెలిపారు. ఈక్రమంలో గత నెల 5న సదరు వ్యక్తిని శృతి నిలదీసి అడగగా డబ్బులు ఇవ్వను పో, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ దబాయిస్తున్నాడని బాధితురాలు వాపోయింది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్న సదరు వ్యక్తిని విచారించి చట్టరీత్యా చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని బాధితురాలు శృతి కోరుతున్నది.