జల్సాల కోసం విద్యుత్ మోటర్ల చోరీ
జల్సాలకు అలవాటు పడి విద్యుత్ మోటర్ల చోరీకి పాల్పడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.14.19లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఈస్ట్ జోన్ డీసీపీ పులిగిల్ల రవీందర్ తెలిపారు. పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు.
పరకాల, మార్చి 21: జల్సాలకు అలవాటు పడి విద్యుత్ మోటర్ల చోరీకి పాల్పడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.14.19లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఈస్ట్ జోన్ డీసీపీ పులిగిల్ల రవీందర్ తెలిపారు. పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. హనుమకొండకు చెందిన బండారి అనిల్ ఐటీఐ పూర్తి చేసి మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. జల్సాల కోసం సులువుగా డబ్బులు సంపాదించడానికి టేకుమట్ల మండలం రాఘవరెడ్డిపేటకు చెందిన మాటూరి అరవింద్‌తో కలిసి మోటర్లను దొంగిలించారు. అనంతరం ఒక మైన ర్, మొగుళ్లపల్లి మండలం కొర్కిశాలకు చెందిన సరిగొప్పుల సాయితేజ, కమలాపురం హరీశ్‌ను కలుపుకుని మరిన్ని మోటర్లు దొంగిలించారు.
వీరు హనుమకొండలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను కిరాయికి తీసుకుని పరకాల, దామెర, మొగుళ్లపల్లి, ఇల్లంతకుంట మండలాల్లోని పలు గ్రా మాల్లో ఎస్సారెస్పీ కాల్వ, బావుల వద్ద ఉన్న మోటర్లను దొంగిలించేవారు. నడికూడ మండల శివారులో పరకాల పోలీసులు తనిఖీ చేస్తుండగా వారి కారులో 6 విద్యుత్ మోటర్లు కనిపించాయి. వారిని విచారించగా దొంగిలించిన మోటర్లను హుజూరాబాద్‌కు తరలించి ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు ఒప్పుకున్నారు. 5 మోటర్లు, 57 కేజీల కాపర్ వైరు, నాలుగు సెల్ఫోన్లు, రెండు కార్లు, రూ.41 వేల నగదును స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ కిశోర్‌కుమార్, సీఐ రవిరాజు, ఎస్సై రమేశ్, కానిస్టేబుళ్లు భాస్కర్, కృష్ణకుమార్, దేవేందర్, కే నాగరాజు, డీ నాగరాజు, భాస్కర్, హోంగార్డులు సుధాకర్, రామన్న, రవీందర్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

