కాజీపేట, ఏప్రిల్ 28: ఇంట్లో నుంచి తప్పిపోయి వచ్చి కాజీపేట రైల్వేస్టేషన్లో తిరుగుతున్న బాలికను రైల్వే ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు పట్టుకొని చైల్డ్ లైన్‌కు అప్పగించిన సంఘటన సోమవారం జరిగింది. కాజీపేట జీఆర్ఐఈ సీఐ రామ్మూర్తి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాజీపేట రైల్వేస్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఆర్పీఎఫ్ సిబ్బందికి ఒకటో నంబర్ ప్లాట్ ఫామ్ పై అనుమానాస్పదంగా తిరుగుతూ బాలిక కనిపించిం దన్నారు. ఆ బాలికనుపోలీసులు పట్టుకొని జీఆర్పీ సిబ్బందికి అప్పగించారాని తెలిపారు.
బాలిక తన పేరు కావ్య (6) తండ్రి పేరు వీరన్న, మండపల్లి గ్రామం ఒంగోలు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తెలిపిందన్నారు. ఆ తప్పిపోయి వచ్చిన బాలికను చైల్డ్ లైన్ సిబ్బందికి అప్పగించామన్నారు. ప్రస్తుతం కావ్య నగరంలోని చైల్డ్ లైన్ కేంద్రంలో ఆశ్రయం పొందు తున్నట్లు తెలిపారు. బాలికకు సంబంధించి ఎవరైనా సంబంధీకులు ఉంటే కాజీపేట జీఆర్పీ సీఐ, లేదా 87126 58578, 87126 58609 సెల్ నంబర్ లలో సంప్రదించాలని కోరారు.