హనుమకొండ, నవంబర్ 17: జిల్లా గ్రంథాలయ సంస్థ హనుమకొండలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా 4వ రోజు సోమవారం ఉదయం 11 గంటలకు ‘గ్రంథాలయాలు’ అనే అంశంపై కవిసమ్మేళనం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మహ్మద్ అజీజ్‌ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ బన్న ఐలయ్య, ప్రపంచం శాంతి బిరుదు గ్రహిత(కవి) ఎండి.సిరాజుద్దీన్ హాజరయ్యారు. వీరి సమక్షంలో 25 కవులు కవితలను వినిపించారు.
అనంతరం కవులను గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ అజీజ్‌ఖాన్, కార్యదర్శి శశిజాదేవి ఘనంగా సన్మానించారు. గ్రంథాలయ పాఠకులకు మోటివేషన్ కార్యక్రమాన్ని కేయూ ప్రొఫెసర్ వంశీకృష్ణచే పుస్తక పాఠనం గురించి వివరించారు. గ్రంథపాకులకు, మెడిటేటేషన్ మెలుకువులను డాక్టర్ శ్రీదేవిచే నిర్వహించారు. హనుమకొండ కేంద్ర గ్రంథాలయ సంస్థ ఉత్తమ గ్రంథ పాఠకుడుగా జి.కరుణాకర్, ఉత్తమ గ్రంథ పాఠకురాలిగా జి.కావ్యశ్రీని ఎంపిక చేసి సత్కరించారు. గ్రంథ పాలకులు గ్రేడ్-2 లైబ్రరియన్ సీహెచ్.మలుసూర్, ఎం.పురుషోతంరాజు, జూనియర్ అసిస్టెంట్ సంతోష్, రికార్డు అసిస్టెంట్ మమతా, ఇంటర్నెట్ సెక్షన్ నిర్వాహకులు జి.రాజేష్, గ్రంథలయ సిబ్బంది, గ్రంథ పాఠకులు పాల్గొన్నారు.