జనగామ చౌరస్తా, అక్టోబర్ 4: లైంగిక దాడి కేసులో వివరాలిలా ఉన్నాయి.. దేవరుప్పుల మండలానికి చెందిన ఓ బాలిక (14)తో పాటు మల్కాజిగిరి చెందిన మరో బాలిక(15) పలు కారణాలతో సైదాబాద్ పీఎస్ పరిధిలోని పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్నారు. సెప్టెంబర్ 24న బాలికలిద్దరూ పారిపోయి జనగామకు వచ్చా రు.
రాత్రి కావడంతో బస్టాండ్ సమీపంలో పాన్‌షాప్ నిర్వాహకుడి వద్ద ఫోన్ తీసుకొని పరిచయం ఉన్న మరో యువకుడికి ఫోన్ చే శారు. అక్కడికి చేరుకున్న సదరు యువకుడు దేవరుప్పుల మండలానికి చెందిన బాలికను తన వెంట తీసుకెళ్లి లైంగిక దాడి చేయగా, బ స్టాండ్ వద్ద మరో బాలికకు ఆశ్రయం కల్పిస్తానని నమ్మబలికిన పాన్‌షాప్ నిర్వాహకుడితోపాటు అతడి ముగ్గురు స్నేహితులు కలిసి లైంగిక దాడి చేసినట్లు సమాచారం. మరుసటి రోజు రాత్రి బస్టాండ్ దగ్గర ఒంటరిగా తిరుగుతున్న ఇద్దరు బాలికల్ని గుర్తించిన జనగామ అర్బన్ పోలీసు లు వారిని చేరదీశారు.
అప్పటికే బాలికలిద్దరిపై సైదాబాద్ పీఎస్‌లో మిస్సింగ్ కేసు నమోదై ఉన్న విషయాన్ని తెలుసుకుని వారికి సమాచారం అందించా రు. సైదాబాద్ పోలీసులు బాలికలను విచారించగా, వారిపై ఐదుగురు యువకులు లైం గిక దాడికి చేశారన్న విషయం తెలుసుకొని వారిపై పోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు తెలిసింది.