గీపుగొండ, డిసెంబర్ 17 : నాటిన ప్రతి మొక్కనూ రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిదని అదనపు కలెక్టర్ హరిసింగ్ అన్నారు. మండలంలోని కొమ్మాల, విశ్వనాథపురం, గంగదేవిపల్లి గ్రామాల్లో ప్రధాన రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను అయన పరిశీలించారు. ఈ సందర్భంగా హరిసింగ్ మాట్లాడుతూ మొక్కలకు సపోర్టుగా కర్రలు నాటాలని సిబ్బందిని ఆదేశించారు. రైతులు తమ పొలాలకు సమీపంలో ఉన్న మొక్కలను రక్షించాలన్నారు. అనంతరం మొక్కలకు నీళ్లు పోశారు. కార్యక్రమంలో వీరాటి రవీందర్‌రెడ్డి, గుగులోత్ రాజు, కృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
‘పల్లె ప్రగతి’తో గ్రామాల అభివృద్ధి : డీపీవో
దుగ్గొండి: పల్లెప్రగతి పనులతో గ్రామాల రూపురేఖలు మారి సర్వతోముఖాభివృద్ధి చెందుతున్నాయని డీపీవో ప్రభాకర్ అన్నా రు. మండలంలోని వెంకటాపురంలో జరుగుతున్న పల్లెప్రగతి పనులను పరిశీలించిన ఆయన నర్సరీ, శ్మశానవాటిక, డంపింగ్‌యార్డులో తయారు చేస్తున్న సేంద్రియ ఎరువును చూశారు. అనంతరం జీపీ కార్యాలయంలో పలు రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో డీపీవో మాట్లాడుతూ గ్రామంలో అసంపూర్తిగా ఉన్న పల్లెప్రగతి పనులను సకాలంలో పూర్తి చేసి గ్రామాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలన్నారు. జీపీ సిబ్బందితో పాటు అధికారులు సమయపాలన పాటించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఎంపీవో శ్రీధర్‌గౌడ్, సర్పంచ్ ఇంగోళి రాజేశ్వర్‌రావు, పంచాయతీ కార్యదర్శి, జీపీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
నర్సరీ పనులు పూర్తి చేయాలి : ఏపీడీ
నర్సంపేటరూరల్ : మండలంలోని 27 గ్రామాల్లో నర్సరీ పనులను త్వరగా పూర్తి చేయాలని ఏపీడీ వసుమతి అన్నారు. మండలంలోని ముగ్ధుంపురం, పాతముగ్ధుంపురం గ్రామాల్లోని నర్సరీ పనులను ఆమె పరిశీలించారు. బ్యాగ్ ఫిల్లింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు పెండ్యాల జ్యోతి, లావణ్య, ఏపీవో ఫాతిమామేరి, టీఏ సుధాకర్, పంచాయతీ కార్యదర్శి రహీంపాషా పాల్గొన్నారు.