వర్ధన్నపేట/దుగ్గొండి/ఖానాపురం/చెన్నారావుపేట(నెక్కొండ)/చెన్నారావుపేట/రాయపర్తి, జనవరి 20: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని వర్ధన్నపేట ఎంపీపీ అన్నమనేని అప్పారావు అన్నారు. మండలంలోని బండౌతాపురంలో గురువారం ఆయన రూ. 5 లక్షలతో చేపట్టిన సీసీరోడ్డు నిర్మాణ పనులను జడ్పీటీసీ మార్గం భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ కౌడగాని రాజేశ్‌ఖన్నాతో కలిసి ప్రారంభించారు. పల్లెల్లోని ప్రతి వీధిలో సీసీరోడ్డు సౌకర్యం కల్పించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రజలు కూడా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, సర్పంచ్ మరుపట్ల అరుణ, ఎంపీటీసీ మరుపట్ల సురేశ్, ఉపసర్పంచ్ అరుణ తదితరులు పాల్గొన్నారు. దుగ్గొండి మండలం చంద్రయ్యపల్లిలో హనుమాన్ గుడి నుంచి పోచమ్మ ఆలయం వరకు సీసీరోడ్డు నిర్మాణ పనులను ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎంపీపీ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణప్రసాద్, పీఆర్ ఏఈ వెంకటేశ్వర్లు, ఎంపీవో శ్రీధర్‌గౌడ్, సర్పంచ్ పల్లాటి భవానీకేశవారెడ్డి, ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ పల్లాటి జైపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు, వీరేశం పాల్గొన్నారు. ఖానాపురం మండలం అయోధ్యనగర్‌లో సీసీరోడ్డు పనులను ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు ప్రారంభించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల రూపురేఖలు మారిపోయినట్లు ఆయన తెలిపారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, వైస్ ఎంపీపీ రామసహాయం ఉమారాణి, ఉపేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, సర్పంచ్ జర్పుల అశోక్, ఉపసర్పంచ్ లింగమూర్తి, గుడిపూడి నాగేశ్వర్రావు, కార్యదర్శి యుగేంధర్ పాల్గొన్నారు.
నెక్కొండ మండలం అలంకానిపేటలోని ఒకటో వార్డులో సర్పంచ్ మాదాసు అనంతలక్ష్మీరవి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్ సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ సూరం రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుంటుక సోమయ్య, ఉపసర్పంచ్ గుంటుక నర్సయ్య, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు చీకటి శ్రీనివాస్, కో ఆప్షన్ సభ్యులు మంగిశెట్టి రాజారాం, కొమ్మాలు, యూత్ అధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఉపేందర్, బాబు పాల్గొన్నారు. చెన్నారావుపేట మండలం లింగాపురం గ్రామంలో సర్పంచ్ తప్పెట రమేశ్, ఎంపీటీసీ పసునూరి రమేశ్ సీసీరోడ్డు పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో వార్డు సభ్యురాలు ఓరుగంటి రజితాకట్టయ్య పాల్గొన్నారు. రాయపర్తి మండలంలోని రాయపర్తి, మైలారంలో సీసీరోడ్ల నిర్మాణ పనులను జడ్పీటీసీ రంగు కుమార్ ప్రారంభించారు. కార్యక్రమాలలో సర్పంచ్‌లు గారె నర్సయ్య, లేతాకుల సుమతీ యాదవరెడ్డి, ఎంపీటీసీలు అయిత రాంచందర్, బిల్ల రాధికా సుభాష్‌రెడ్డి, గాడిపల్లి వెంకన్న, గబ్బెట బాబు, లేతాకుల మాధవరెడ్డి, గబ్బెట యాకయ్య, సంది వంశీధర్‌రెడ్డి, తాళ్ల సోమిరెడ్డి, గాడిపల్లి రాములు, యాకాంత, చిర్ర ఈరమ్మ, గూడెల్లి వెంకటయ్య, గబ్బెట కొమురయ్య, సంకినేని ఎల్లస్వామి పాల్గొన్నారు.