గీసుగొండ, జనవరి 30: రాష్ట్రంలో జరుగుతున్న అభి వృద్ధిని దేశ ప్రజలు కోరుకుంటున్నారని, యావత్ దేశ ప్రజలంతా సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గీసుగొండ మండలం మనుగొండ ఎంపీటీసీ, గీసుగొండ వైస్ ఎంపీ పీ రడం శ్రావ్య, భరత్ దంపతులు, రాంపురం సర్పంచ్ గాజర్ల గోపి, వారి అనుచరులు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సోమవారం హైదరాబాద్‌లో మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మె ల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరా రు.
వారికి మంత్రులు పార్టీ కండువాలను కప్పి ఆహ్వా నించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడు తూ ప్రత్యేక రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ చేసిన అలుపె రు గని పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. దేశంలో అభివృద్ధిని మరిచి మత రాజకీయాలు చేస్తున్న పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎర్రబెల్లి
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి ఎర్రబె ల్లి దయాకర్‌రావు అన్నారు. గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్ర భుత్వం భారీగా నిధులను కేటాయిస్త్తోందన్నారు. ప్రతి గ్రామం ఆదర్శంగా అభివృద్ధి చెందుతోందన్నారు.
కొత్త పాత తేడా లేకుండా కలిసి పనిచేద్దాం: చల్లా
నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చే స్తానని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. కొత్త పాత తేడా లేకుండా నాయకులకు పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్నారు. పార్టీలో చేరిన వారిలో మచ్చా పురం మాజీ సర్పంచ్ నమిండ్ల మానయ్య, నాయకులు పోలబోయిన గోవర్ధన్, శ్రీనివాస్, కందికొండ రాజు, గు రువయ్య, సంపత్, రంజిత్, శ్రవణ్, మంద అనిల్, నగే శ్, సుమన్, రాము తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్, జడ్పీటీసీ పోలీసు ధర్మా రా వు, మం డల పార్టీ అధ్యక్షుడు వీరగోని రాజుకుమార్, సర్పంచ్‌లు జైపాల్‌రెడ్డి, నాగేశ్వర్రావు, నాయకులు లెని న్, బాలకృష్ణ పాల్గొన్నారు