కృష్ణకాలనీ/మహదేవపూర్/మహాముత్తారం /కాటారం / మొగుళ్లపల్లి / వెంకటాపురం (నూగూరు)/ ములుగు రూరల్, జనవరి 14 : ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ప్రజలు ఆదివారం భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు గ్రామాలకు చేరుకున్నారు. ప్రజలు వేకువజామున లేచి భోగి మం టలు వేసుకొని ఆడిపాడారు. ఇంటి ముందు మహిళలు, చిన్నారులు తీరొక్క రంగులతో ము గ్గులు వేసి గొబ్బెమ్మలతో అలంకరించారు. చిన్నారులు గాలిపటాలను ఎగురవేశారు. ఇం దులో భాగంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డికాలనీలో భారత జాగృతి జిల్లా అధ్యక్షుడు మాడ హరీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో భోగి వేడుకలు నిర్వహించారు.
జాగృతి స్థానిక నాయకులతో కలిసి భోగి మంట లు ఏర్పాటు చేయగా కాలనీ ప్రజలు, పెద్దలు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం పాటలు, నృత్యాలతో భోగి మంట చుట్టూ తిరిగారు. కార్యక్రమంలో 30వ వార్డు కౌన్సిలర్ మాడ కమలా లక్ష్మారెడ్డి, జాగృ తి నాయకులు సందీప్‌గౌడ్, ప్రశాంత్, వంశీ, శ్రీనాథ్, ఆదిత్య, కాలనీ పెద్దలు మోహన్‌రెడ్డి, జగన్, లక్ష్మారెడ్డి, రాజిరెడ్డి, మల్లార్డెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహదేవపూర్ మండల కేంద్రంతో పాటు కాళేశ్వరం, బ్రాహ్మణపల్లి, బొమ్మాపూర్, అంబట్పల్లి, పెద్దంపేట, రాపల్లికోట, ఎల్కేశ్వరం, బెగ్లూర్, ఎన్కపల్లి, కుదురుపల్లి, ఎడపల్లి గ్రామాల్లో వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. అలాగే మహాముత్తారం మండల వ్యాప్తంగా భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు.
టేకుమట్ల మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో భోగి వేడుకలను ఘనం గా జరుపుకున్నారు. బూర్నపల్లిలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, జడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి హాజరై గెలుపొందిన మ హిళలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పెరుమాండ్ల మొగిలి గౌడ్, నేరెళ్ల రామకృష్ణగౌడ్, రేణుకుంట్ల సంతోష్, సర్వేశం, సరోత్తంరెడ్డి, రఘు, రవి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. కాటారం మం డల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో భోగి వేడుకలు నిర్వహించారు. చేదు జ్ఞాపకాలను వదిలి నూతనోత్తేజం, వినూత్న ఆలోచనలతో ప్రజలు ముందుకెళ్లాలని పాత వస్తువులను భో గిమంటల్లో వేస్తారని వేద పండితులు కృష్ణమో హన్, గణేశ్, ప్రవీణ్, రామ్మూర్తి, లక్ష్మీకాంత్ తెలిపారు.
అలాగే మొగుళ్లపల్లి మండలంలో భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. వెంకటాపురం నూగూరు మండలంలోని గ్రా మాల్లోని ప్రజలు ఆదివారం భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. గ్రామ కూడళ్ల వద్ద భోగి మంటలు వేశారు. పలు ఆలయాల్లో పూజలు చేశారు. వీఆర్కే పురం సర్పంచ్ పూనెం బీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి డర్రా దామోదర్, వివేక్, రవి పాల్గొన్నారు. అలాగే ములుగు పట్టణంతో పాటు మండలం లోని గ్రామాల్లో ప్రజలు భోగి పండుగను ఘ నంగా జరుపుకున్నారు. కాసిందేవిపేటలో యూ త్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వ హిం చారు. మొదటి బహుమతి కస్తూరి అనూ ష, రెండో బహుమతి ఎడ్ల అఖిల, మూడో బ హు మతి గుంజె శ్రుతికి గెలుచుకోగా, సర్పంచ్ అ హ్మద్పాషా బహుమతులను ప్రదానం చేశారు.
రేగొండ, జనవరి 14 : ప్రవిత్ర పూణ్యక్షేత్రమైన మండలంలోని కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆదివారం భోగి పండుగను ఆదివారం నిర్వహించగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వా గతం పలికారు. కాగా, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని ద ర్శించుకున్నారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మాదాటి అనిత, ఈవో శ్రీనివాస్, ధర్మక్తరలు మాదాటి కరుణాకర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు నాయినేని సంపత్‌రావు, ఇప్పకాయల నర్సయ్య, గుంటోజు కిష్టయ్య, మ్యాకల భిక్షపతి, పున్నం రవి, కోలెపాక సాంబయ్య పాల్గొన్నారు.