నర్సింహులపేట మే 22 : వర్షం పడిందంటే చాలు రోడ్ల పైకి రావాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని కొమ్ములవంచ గ్రామంలోని ప్రధాన రహదారి నుండి నర్సింహులపేట, నెల్లికుదురు, దంతాలపల్లి మండలాకు వివిధ గ్రామాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు సీసీ రోడ్లు బురదమయంగా మారడంతో ఇబ్బంది పడుతున్నారు.
సీసీ రోడ్లుపై గల గుంతల్లో వర్షపు నీరు నిలువడంతో వాహనాలు వచ్చినపుడు ఆగుంతల్లో మురుగు నీరు పాదచారులపై పడి పలు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి సీసీ రోడ్డు పక్కన సిబ్బందితో కాలువలు తీయించి బురద నీరు వెళ్లేందుకు చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.