జనగామ రూరల్, ఆగస్టు 27: పేదల అభ్యున్నతికి సంక్షేమ పథకాలు అమలు చేయడంతోపాటు వారి ఆత్మగౌరవం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఆసరా పథకంలో జనగామ మండలంలో కొత్తగా 1,114 మందికి పింఛన్ మంజూరైంది. ఈ నేపథ్యంలో స్థానిక గాయత్రి గార్డెన్లో లబ్ధిదారులకు గుర్తింపు కార్డులను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పంపిణీ చేసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు 57 సంవత్సరాలు నిండిన వారికి ఆసరా పథకంలో పింఛన్ మంజూరు చేశామని తెలిపారు. దీంతో ఊరూరా పండుగ వాతావరణం నెలకొందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేని ప్రతిపక్ష నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఆయన వివరించారు. దీనిపై గతంలో గతంలో ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్ సమావేశంలో కొనియాడారని గుర్తు చేశారు. పొరుగు రాష్ర్టాలు సైతం తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి అబ్బురపడుతున్నాయని ముత్తిరెడ్డి తెలిపారు.
లబ్ధిదారుల భోజన ప్లేట్లను స్వయంగా తీసిన ముత్తిరెడ్డి
ఆసరా పింఛన్ లబ్ధిదారులకు కడుపు నిండా భోజనం పెట్టించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వారిని అక్కున చేర్చుకున్నారు. వారు భోజనం చేశాక ఎంగిలి ఇస్తారాకులను స్వయంగా తీసి చెత్తబుట్టలో వేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం ఇస్తారాకులను తీశానని ముత్తిరెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్డీవో గూడూరు రాంరెడ్డి, జడ్పీ సీఈవో ఎల్ విజయలక్ష్మి, ఆర్డీవో మధుమోహన్, ఎంపీపీ కళింగరాజు, జనగామ వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ విజయ, జడ్పీటీసీ దీపిక, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు యాదగిరిగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ మహేందర్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు శారద, లక్ష్మి, ఎంపీడీవో ఉప్పుగల్లు సంపత్‌కుమార్, పీఆర్ ఏఈ శ్రీనివాస్, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు సిద్ధిలింగం, సర్పంచులు, ఎంపీటీసీలు ఆంజనేయులు, దీపక్‌రెడ్డి, శ్రీనివాస్, జయరాం, మంజుల, స్వప్న, నిర్మల, శ్రీలత, సుజాత, స్వరూప, పద్మ, శాలమ్మ, లావణ్య, రజిత తదితరులు పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే ధ్యేయం : రాజయ్య
రఘునాథపల్లి : పేదల అభివృద్ధి, సంక్షేమమే తెలంగాణ సర్కారు ధ్యేయమని స్టేషన్‌ఘన్‌ఫూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. ఆసరా పథకంలో మండలంలో కొత్తగా 1,987 మంది లబ్ధిదారులకు పింఛన్ మంజూరు కాగా శనివారం స్థానిక ఏఎస్ఆర్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో లబ్ధిదారులకు ఆయన గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. సర్పంచ్ పోకల శివకుమార్ అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ఆసరా పథకంలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు పింఛన్ అందిస్తున్నారని తెలిపారు. రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేస్తూ వ్యవసాయానికి ఉచితంగా నిరంతర విద్యుత్ అందిస్తున్నారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ ఆమీద్, డీఆర్డీవో గూడూరు రాంరెడ్డి, ఎంపీపీ మేకల వరలక్ష్మి, వైస్ ఎంపీపీ రంగమ్మ, ఎంపీడీవో హసీం, టీఆర్ఎస్ మండల సమన్వయకర్తలు మడ్లపల్లి సునీతరాజు, నామాల బుచ్చయ్య, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ముసిపట్ల విజయ్, ఎంపీటీసీలు కేమిడి రమ్య, పేర్ని ఉష, నాయకులు మేకల మురళి, అజయ్, తాటికొండ వెంకటేశ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.