నల్లబెల్లి/ నర్సంపేట : ఎల్కతుర్తిలో నిర్వహించబోయే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ జనరంజకంగా మారబోతుందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎల్కతుర్తి X రోడ్ వద్ద జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నర్సంపేట నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు, ముఖ్యంగా రైతులు , యువకులు పెద్ద ఎత్తున తరలిం చడానికి అన్ని గ్రామాలు, వార్డులలో కూడా సన్నాక సమావేశాలు పూర్తి దశకు వచ్చాయని తెలిపారు. గ్రామ గ్రామాణ ఉత్సాహంగా నాయకత్వం కదులుతుంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, రేవంత్ రెడ్డి పాలన వచ్చిన తరువాత వ్యవసాయ రంగం చితికి పోయింది, రైతులు మానసిక ఒత్తిడికి లోనవుతు న్నారన్నా రు. రైతులకు ఆర్దికంగా చేయుతలేదు పంటలకు నష్టం జరిగితే ఎవరు ముఖం కూడ చూపెట్టలేని దుస్థితి నెలకొందన్నారు.
ఈనెల 27న జరిగే రజతోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేశామని నర్సంపేట నియోజకవర్గం నుండి రజతోత్సవ సభకు వెళ్లడానికి ఆర్టీసీ బస్సులు, డీసీఎం, ద్విచక్ర వాహనాలు, ప్రైవేటు వాహనాలు చేశామన్నారు ఎండ తీవ్రత ఉండడంతో పదిలక్షల మజ్జిగ ప్యాకెట్లు, పదిలక్షల వాటర్ బాటిల్ సభకు సర్వం సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి,ఓడీసీఎంస్ మాజీ చైర్మన్ గోగులోత్ రామస్వామి నాయక్, పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నాగేల్లి వెంకట్ నారాయణ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ ,బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు గోనె యువరాజ్, పట్టణ ప్రధాన కార్యదర్శి వెనుముద్దల శ్రీధర్ రెడ్డి, మాజీ జడ్పిటిసి బాలు, మాజీ కౌన్సిలర్లు నాగిశెట్టి ప్రసాద్, దేవోజు సదానందం, మండల శ్రీనివాస్,బండి ప్రవీణ్, శివరాత్రి స్వామి, పట్టణ యువజన విభాగం ప్రథాన కార్యదర్శి నాయిని వేణుచంద్, ఉపాధ్యక్షులు పైసా ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్వీ పట్టణ అధ్యక్షులు దేవోజు హేమంత్, బీరం అనంతరెడ్డి, నల్ల రవీందర్ తదితరుల పాల్గొన్నారు.