నల్లబెల్లి, మార్చి 15: వరంగల్ (Warangal) జిల్లాలోని నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన సీతారామ స్వామి దేవాలయం ధర్మకర్త, నల్లబెల్లి అభివృద్ధి కమిటీ ముఖ్య సలహాదారుడు కొండ లక్ష్మణ స్వామి గుండెపోటుతో మరణించాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఆలయ ధర్మకర్త మృతి చెందిన వార్త తెలుసుకున్న నర్సంపేట మాజీ శాసన సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy).. లక్ష్మణ స్వామి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తపరిచారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఏలాంటి ఆలయాలు లేని సందర్భంలో తన సొంత స్థలం ఇచ్చి గ్రామస్థుల సహకారంతో రామలయాన్ని నిర్మించిన గొప్ప వ్యక్తి లక్ష్మణ స్వామి అన్నారు. ఆయన మృతి గ్రామానికి తీరని లోటని చెప్పారు. పరామర్శలో స్థానిక బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు క్యాతం శ్రీనివాస్, మాజీ సర్పంచ్ నానబోయిన రాజారామ్ యాదవ్, వేల్పుల రవి, గుమ్మడి వేణుతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు నివాళులు అర్పించారు.