నల్లబెల్లి, మే 07 : పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు రావాలని కోరుతూ పలువురు ముదిరాజ్ కులస్తులు ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు నల్లబెల్లి మండలంలోని నారక్కపేటలో ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని ఈనెల 14 న విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డిని ముఖ్య అతిథిగా ముదిరాజ్ కులస్తులు ఆహ్వానించారు.
కార్యక్రమంలో మండలం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీపతి సుమన్, ముదిరాజు కుల పెద్దలు కావటి శ్రీనివాస్ పెసరు కుమారస్వామి సిద్ధ రాంబాబు ఈర్ల ప్రశాంత్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Operation Sindoor | ఆపరేషన్ సిందూర్‌పై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందన ఇదీ..
OPERATION SINDOOR | ఆపరేషన్ సిందూర్‌తో భారత్ ప్రతీకారం.. స్పందించిన ట్రంప్, గుటెర్రాస్
Air strikes | ఇక్కడ 10 నుంచి 15 క్షిపణులు ఢీకొట్టాయి.. భారత్ ప్రతీకార దాడులపై ముజఫరాబాద్ వాసులు