వరంగల్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘ఒకే పార్టీలో ఉంటూ ఘర్షణలు సరికాదు. మంత్రి హో దాలో ఉండి దానికి అనుగుణంగా వ్యవహరించాలి. సొంత పార్టీ కార్యకర్తల మధ్య దూరం పెరగకుండా జాగ్రత్తగా ఉండాలి. కార్యకర్తల మధ్య గొడవలు రాకుండా మ నమే చూడాలి. స్థానిక ఎన్నికల ముందు గ్రూపులు ఉం డడం పార్టీకి నష్టం చేస్తుంది. మంత్రిగా ఎమ్మెల్యేలతో స మన్వయం చేసుకోవాలి. ఇప్పటి నుంచి ఎవరితో అంత రం రాకుండా చూసుకోండి’ అని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ మంత్రి కొండా సురేఖను ఆదేశించినట్లు తెలిసింది.
మంత్రి సురేఖ వైఖరితో వరంగల్ ఉమ్మడి జి ల్లా లో జరిగిన పరిణామాలపై వరంగల్ లోక్‌సభ పరిధిలోని ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, ఎం యశస్వినీరెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సార య్య, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు బుధవారం పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కలిసి వివరించారు. ఉమ్మడి జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో కొండా సురేఖ జోక్యం వల్ల కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు తయారవుతున్నాయని చెప్పారు.
వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని గీసుగొండ పోలీసు స్టేషన్‌కు స్వయంగా మంత్రి సురే ఖ వెళ్లడంపై పా ర్టీలో, ప్రజల్లో ప్రతికూల చర్చ జరుగుతున్నదని వివరించారు. వరంగల్ లోక్‌సభ పరిధిలోని అన్ని సెగ్మెంట్లలోనూ మంత్రి సురేఖ తీరుతో పార్టీకి ఇబ్బందులు ఉంటున్నాయని తెలిపారు. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ అక్కడి నుంచి మంత్రి సురేఖతో ఫోన్లో మాట్లాడారు. వ్యక్తిగత పనుల వల్ల హైదరాబాద్‌కు రాలేకపోయానని, వరంగల్‌లో ఉన్నానని మంత్రి సురేఖ చెప్పినట్లు తెలిసింది.
మంత్రి సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి సమన్వయంతో ముందుకు సాగాలని పీసీసీ చీఫ్ సూచించారు. మంత్రి సురేఖ వైఖరితో ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో నెలకొంటున్న ఇబ్బందులను వివరించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు రెండురోజులుగా సీఎం రేవంత్‌రెడ్డిని కలిసేందుకు ప్రయత్నించారు. అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఈ విషయాన్ని పీసీసీ చీఫ్‌కు అప్పగించారు. మంగళవారం మెద క్, ఆదిలాబాద్ జిల్లాల కాంగ్రెస్ సమీక్షా సమావేశాలు ఉండడంతో పీసీసీ చీఫ్‌ను వీరు కలవలేకపోయారు. బుధవారం సమావేశమై ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ పరిణామాలను వివరించారు.