పరకాల, ఏప్రిల్ 8: ఎంబీబీఎస్ కోర్సులో 6 మెడల్స్ సాధించి పరకాల విద్యార్థి ప్రతిభ చూపింది. పరకాలకు చెందిన ఆరేపల్లి పవనసుధ నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్‌ను ఇటీవల పూర్తి చేసింది. కాగా ఎంబీబీఎస్ కోర్సులో ఐదు సబ్జెక్టులలో డిస్టింక్షన్ సాధించిన పవనసుధ ఇటీవల నిర్వహించిన డిగ్రీ ప్రధానంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శివ ప్రసాద్, గాంధీ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ ఇందిర చేతుల మీదుగా మెడల్స్‌ను అందుకుంది.
కాగా ఆరు మెడళ్లను అందుకున్న పవనసుధను కళాశాల అధ్యాపకులు, తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు అభినందించారు. ఈ సందర్భంగా పవనసుధ మాట్లాడుతూ ఎమ్మెస్ జనరల్ సర్జన్ పూర్తి చేసి జీవితంలో పేద ప్రజలకు వైద్య సేవలు అందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.