కమలాపూర్, మే 19: ఇంజిన్‌లో సాంకేతి క లోపంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉప్పల్ రైల్వేస్టేషన్లో ఆదివారం రెండు గంటలకుపైగా నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డా రు. కాగజ్‌నగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సి న కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌ను సాయంత్రం 6 గంటలకు, అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళ్లాల్సి న నవజీవన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును గంటలకు ఉప్పల్ రైల్వేస్టేషన్లో నిలిపివేశారు.
రెండు రైళ్లకు సంబంధించిన ఇంజిన్ల ను మార్చేందుకు 2గంటలకుపైగా సమయం పట్టడంతో స్టేషన్లో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. తాగునీరు సైతం లేక ఇబ్బందులు పడుతున్నామని స్టేషన్ మాస్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 8.10కి నవజీవన్, 8.20 గంటలకు కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను పంపించి రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.