నరక ప్రయాణం!
వేసవిలో రైలు ప్రయాణం నరకం గా మారింది. సెలవుల్లో సొంత ఊర్లు, బంధువుల ఇండ్లు, తీర్థయాత్రలకు వెళ్తున్న ప్రయాణిలకు రిజర్వేషన్లు దొరకక, జనరల్ బోగీల్లో ప్రయాణిస్తూ అవస్థలు పడుతున్నా రు. ఇసుకేస్తే రాలనంత జనంతో జనరల్ బోగీలు కిక్కిరిసిపోతుండగా, వృద్ధులు, చిన్న పిల్లలు భరించలేని ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు.
- రైళ్లలో రిజర్వేషన్లు దొరకక ప్రయాణికుల పాట్లు
- జనరల్ బోగీల్లో సీట్లు లేక అవస్థలు
- రైల్వే స్టేషన్లో తాగునీటికి కటకట
- జనరల్ బోగీలు పెంచాలని విజ్ఞప్తి
కాజీపేట, మే 26 : వేసవిలో రైలు ప్రయాణం నరకం గా మారింది. సెలవుల్లో సొంత ఊర్లు, బంధువుల ఇండ్లు, తీర్థయాత్రలకు వెళ్తున్న ప్రయాణిలకు రిజర్వేషన్లు దొరకక, జనరల్ బోగీల్లో ప్రయాణిస్తూ అవస్థలు పడుతున్నా రు. ఇసుకేస్తే రాలనంత జనంతో జనరల్ బోగీలు కిక్కిరిసిపోతుండగా, వృద్ధులు, చిన్న పిల్లలు భరించలేని ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. బోగీల్లో సీట్ల కోసం ప్రయాణికుల మధ్య యుద్ధాలు కామన్‌గా మారాయి. ఈ బాధ లు పడలేక తప్పని పరిస్థితుల్లో రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణిస్తూ.. టికెట్ కలెక్టర్లు దొరికిపోతూ జరిమానాలు కడుతున్నారు.
దక్షిణ మధ్య రైల్వేలో ఉత్తర, దక్షిణ దృవాలకు ముఖ ద్వారంగా ఉన్న కాజీపేట రైల్వే జంక్షన్ మీదుగా ప్రతిరోజూ వందకు పైగా రైళ్లలో వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. కాజీపేట రైల్వే జంక్షన్ మీదుగా భద్రాచలం రోడ్డు, విజయవాడ, తిరుపతి, చెన్నై, విశాఖపట్నం, షాలిమార్, బలార్షా , ఢిల్లీ, వారణాసి, అయోధ్య, ముంబాయి, షిర్టీ ఆపై సెక్షన్ల వరకు వెళ్లే రైళ్లకు ఈ రూటు చాలా కీలకమైంది. అయితే, రిజర్వేషన్, తా త్కాల్ విషయానికి వస్తే క్యూ లైన్లో నిలబడినా కొంత సమయానికే కోటా అయిపోవడంతో ప్రయాణికులకు కా వాల్సిన రిజర్వేషన్ టికెట్లు దొరకడం లేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో జనరల్ బోగీలను ఆశ్రయిస్తున్నారు.
రైల్వే సబ్ డివిజన్ పరిధిలో ప్రతి రోజూ నడిచే కొన్ని రైళ్లలోను రైల్వే అధికారులు రైల్వేకు ఆదాయం సమకూర్చేందుకు జనరల్ బోగీలను తగ్గించి ఎక్కువగా రిజర్వేషన్ బోగీలను ప్రవేశపెట్టారు. సుదూర ప్రాంతాలకు నడుస్తున్న ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కేవలం కొన్ని రైళ్లల్లో మూడు, మరికొన్నింటిలో నాలుగు జనరల్ బోగీలు ముందు భా గంలో కొన్ని, వెనుక మరికొన్ని ఉంటున్నాయి, ఒక్కో బో గీలో పరిమితి (స్థాయికి)కి మించి ప్రయాణికులు ఎక్కుతున్నారు. మూత్ర విసర్జనకు సైతం వెళ్లలేని పరిస్థితి ఉంటున్నది.

మరుగుదొడ్ల దుర్వాసన భరించలేక ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కాజీపేట రైల్వే జంక్షన్ మీదుగా నడిచే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో జనరల్ బోగీలను పెంచాలని ప్రయాణికులు రైల్వేశాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతోపాటు రైళ్లు, రైల్వే స్టేషన్లలో అసౌకర్యాలతో ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. కాజీపేట రైల్వే సబ్ డివిజన్ పరిధిలోని చాలా స్టేషన్లల్లో నల్లా నీరు వస్తున్నా అవి తాగడానికి ఏ మాత్రం ఉపయోగపడడం లేదు. మధ్యా హ్నం వేళల్లో ప్రయాణికుల చివరి బోగీలకు మండుటెండలో నడిచి వెళ్లాల్సి వస్తున్నది.
కాజీపేట, జనగామ, వరంగల్, మహబూబాబాద్, మంచిర్యాల, బెల్లంపల్లి వంటి రైల్వే స్టేషన్లలో అమృ త్ భారత్ పథకం పనులు జరుగుతుండడంతో సామాన్య ప్రయాణికులకు తాగడానికి నీరు, మల మూత్ర విసర్జనకు మరుగుదొడ్లు లేకుండా పోయాయి. చాలా స్టేషన్లలో మరుగుదొడ్లు ఉన్నా కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా తాళాలు వేసుకుంటున్నారు. అత్యవసరమైతే స్టేషన్ మాస్టార్ వద్దకు వెళ్లి తాళాలు తీసుకునే పరిస్థితి. మౌళిక వసతులపై అధికారులు దృష్టి సారించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
ప్రయాణికులకు తగ్గట్టుగా ఎక్స్‌ప్రెస్ రైళ్లలో జనరనల్ బో గీల సంఖ్యను పెంచ డం లేదు. దీంతో మధ్య తరగతి ప్రజ లు అనేక ఇబ్బందు లు పడుతున్నారు. బోగీల సంఖ్య పెంచాలని ప్రయాణికుల నుంచి వినతులు వెళ్తు న్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. వేసవి సెలవులకు దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని జనరల్ బోగీల సంఖ్య పెంచాలి.
– నల్లా రాజు (ప్రైవేటుఉద్యోగి)
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

