కేసముద్రం, నవంబర్ 23 : హాస్టల్ నుంచి విద్యార్థులను తీసుకెళ్లాలని సూచించడంతో మోడల్ స్కూల్ ఎదుట తల్లిదండ్రులు ఆదివారం ఆందోళన చేట్టారు. కల్వల గ్రామంలో ఉన్న మోడల్ స్కూల్ వసతి గృహంలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 80 మంది విద్యార్థినులు ఉంటు న్నారు. అయితే 6, 7, 8వ తరగతికి చెందిన స్టూడెంట్స్ తల్లిదండ్రులకు ఇన్చార్జి ఎస్వో ఫోన్ చేసి హాస్టల్ నుంచి మీ పిల్లలను ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు.
దీంతో వారు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ విద్యా సంవత్సరం మధ్యలో వెళ్లమంటే ఎలా అని, హాస్టల్ నిర్వహణ సరిగ్గా చేపట్టలేక విద్యార్థులను పంపించడం సరైంది కాదన్నారు. నాణ్యమైన భోజనం, సమయానికి టిఫిన్ అందించడం లేదని, అన్నంలో పురుగులు వస్తున్నాయని పిల్లలు చెబుతున్నారని వారు పేర్కొన్నారు. ఆందోళనతో వెనక్కి తగ్గిన అధికారులు విద్యార్థినులను ఇంటికి పంపించమని, నాణ్యమైన భోజనం ఏర్పాటు చేస్తామని తెలపడంతో పేరెంట్స్ ఇంటికి వెళ్లిపోయారు.
దూర ప్రాంతాల నుంచి రావడానికి ఇబ్బందులు పడే విద్యార్థినుల కోసం వసతి గృహాన్ని ఏ ర్పాటు చేశారు. ఈ ఏడాది సు మారు 80 మంది చేరారు. హాస్టల్‌ను పాలకులు గాలికొదిలేయడంతో సగం మంది ఇంటికి వెళ్లిపోయినట్లు సమాచారం. కుళ్లిన కూరగాయలతో వంట చేయడం, అన్నంలో పురుగులు రావడం, సమయానికి భోజనం పెట్టకపోవ డం, తాగునీటి సమస్యతో విద్యార్థినులు అర్థాకలి తో తరగతి గదులకు వెళ్లేవారు. రాత్రి వేళల్లోను వాచ్మెన్, కేర్‌టేకర్, ఇత ర సిబ్బంది ఉండకపోవడంతో పిల్లలు ఒంటిరిగానే ఉండేవారు. సుమారు 33 మంది ఇంటి నుం చి రోజు పాఠశాలకు వామనాలల్లో వ చ్చి వెళ్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం వస తి గృహంలో 47 మంది విద్యార్థినులు మాత్రమే ఉన్నట్లు సమాచారం.