Minister Errabelli Dayakar Rao | కేసీఆర్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో బీసీలకు సముచిత స్థానం, గౌరవం దక్కిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ సన్మాన సభలో ఆయన మాట్లాడారు. 40 సంవత్సరాల పాటు కాంగ్రెస్‌లో పనిచేసినా గుర్తింపు రాలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే బండా ప్రకాశ్‌కు గుర్తింపు వచ్చిందన్నారు. ఎంపీ, ఎమ్మెల్సీ, మండలి డిప్యూటీ చైర్మన్ పదవి సీఎం కేసీఆర్ ఇవ్వడం సంతోషకరం అన్నారు. చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి తదితరులు బండా ప్రకాశ్‌ను ఘనంగా సన్మానించారు.
హనుమకొండ, ఫిబ్రవరి 15 : కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో బీసీలకు సముచిత స్థానం, గౌరవం దక్కిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి మొదటిసారి హనుమకొండకు వచ్చిన సందర్భంగా ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో బండా ప్రకాశ్‌కు చీఫ్ విప్ ఆధ్వర్యంలో బుధవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి బండా ప్రకాశ్ వన్నె తెస్తారని అన్నారు. ముదిరాజ్‌లు మాత్రమే కాదు బీసీలు, యావత్ ప్రజలంతా గర్వించే స్థాయికి బండా ప్రకాశ్ ఎదిగారని అన్నారు. 40 ఏళ్లపాటు కాంగ్రెస్‌లో పని చేసినా గుర్తింపు రాలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో బండా ప్రకాశ్‌కు ఎక్కువ గుర్తింపు వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ బండా ప్రకాశ్‌కు ఎంపీ, ఎమ్మెల్సీ, మండలి డిప్యూటీ చైర్మన్ పదవి ఇవ్వడం సంతోషకరమన్నారు. అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉన్న ఆయనకు గుర్తింపు రావడం ఉమ్మడి వరంగల్ జిల్లాకు గర్వకారణం అని మంత్రి పేర్కొన్నారు. పదవి రాకముందు నుంచే ముదిరాజ్‌లు, బెస్తవారి కోసం ఆయన కృషి చేశారన్నారు. కానీ, కొందరు మాత్రం పదవి వచ్చిన తర్వాత తాను ముదిరాజ్‌ను అని, ముదిరాజ్‌ల అభివృద్ధి కోసం పాటుపడుతున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ బండా ప్రకాశ్‌కు ప్రొటోకాల్ పోస్టు ఇచ్చారని, కేసీఆర్‌కు అండగా ఉండాలని మంత్రి కోరారు.
సీఎ కేసీఆర్‌కు రుణపడి ఉంటానని శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్ అన్నారు. సీఎం కేసీఆర్ తనపై నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్‌తో తనకు అనుబంధం ఉందన్నారు. సంకల్పం, పట్టుదల, పకడ్బందీ వ్యూహాలతో కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు. అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో 2016లో టీఆర్ఎస్లో చేరినట్లు ఆయన గుర్తుచేశారు. తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, అన్ని వర్గాల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. బీఆర్ఎస్ను దేశ వ్యాప్తంగా విస్తరించాలని, దేశ ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారన్నారు. రూ. వెయ్యి కోట్ల బడ్జెట్‌తో చేప పిల్లల పంపిణీ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు మత్స్యకారులను పట్టించుకోలేదని, రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకారులకు 75 శాతం సబ్సిడీతో 62 వేల వాహనాలు అందించారన్నారు.
రాజ్యసభ పదవి రాదనుకున్న తనకు ఇప్పుడు ఏకంగా శాసన మండలి వైస్ చైర్మన్ పదవి రావడం ఎంతో అనందంగా ఉందన్నారు. బీసీ, ముదిరాజ్ బిడ్డను పార్లమెంట్ మెట్లు ఎక్కించిన మహనీయుడు సీఎం కేసీఆర్ అన్నారు. అపజయాలను విజయాలుగా మార్చేవిధంగా ఎంతో చాకచక్యంగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తారన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపారని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం బీసీ పక్షపాతి అని చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. వరంగల్ జిల్లాపై ఉన్న తన ప్రేమను సీఎం కేసీఆర్ మరోసారి చాటుకున్నారని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లా నుంచి 8 మందికి ఎమ్మెల్సీలు, ఇద్దరికి మంత్రి పదవులు, ఒక చీఫ్ విప్‌తో పాటు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చారన్నారు.
అందుకు రాబోయే ఎన్నికల్లో 12 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం బండా ప్రకాశ్‌ను గజమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజు యాదవ్, కార్పొరేషన్ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్రావు, కే వాసుదేవరెడ్డి, మెట్టు శ్రీనివాస్, అజీజ్‌ఖాన్, ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామీ నాయక్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, లింగంపల్లి కిషన్‌రావు, టీ జనార్దన్, ముదిరాజ్ సంఘం నాయకులు బయ్య స్వామి, పల్లె అశోక్, పులి రజినీకాంత్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.