హనుమకొండ చౌరస్తా: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో భారీగా బదిలీలు అయ్యాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ బదిలీలను చేపట్టింది. భద్రాద్రి కొత్తగూ డెం జడ్పీ సీఈవోగా పనిచేస్తున్న ఎం.విద్యాలతను హనుమ కొండకు, హనుమకొండలో పనిచేస్తున్న ఎస్. వెంకటేశ్వర్రా వు ములుగుకు, ములుగు జడ్పీ సీఈవో ప్రసూ నారాణి భద్రా ద్రి కొత్తగూడెంకు బదిలీ అయ్యారు. హనుమకొండ డీఆర్డీవో ఎ.శ్రీనివాస్‌కుమార్ ములుగుకు, భూపాలపల్లి జిల్లా డీఆర్డీవో డి.పురుషోత్తం మహబూబాబాద్‌కు, ములుగు డీఆర్డీవో కె.నా గపద్మజ హనుమకొండకు, వరంగల్ డీఆర్డీవో ఎం.సంపత్రా వు జగిత్యాలకు, సిద్ధిపేట అడిషనల్ డీఆర్డీ వో జె.కౌసల్యదేవి వరంగల్ డీఆర్డీవోగా నియమితులయ్యారు.
జనగామ జడ్పీ డిప్యూటీ సీఈవో వసంత వికారాబాద్‌కు, కరీంనగర్ నుంచి పవన్‌కుమార్ వరంగల్‌కు, మేడ్చల్ మల్కాజ్గిరి నుంచి సరి త జనగామకు, వరంగల్ నుంచి సాహితీ మిత్ర భూపాలపల్లి జడ్పీ డిప్యూటీ సీఈవోగా బదిలీ అయ్యారు. మహబూబాబా ద్ అడిషనల్ పీడీ వెంకట్‌ను వ్యవసాయ శాఖకు పంపించా రు. ములుగు అడిషనల్ డీఆర్డీవో సిద్ధిపేటకు, వరంగల్ అడి షనల్ డీఆర్డీవో భూపాలపల్లి జిల్లా కు నియమితుల య్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీరమా కాంత్ హనుమకొండకు, హను మకొండ డీపీవో వి.జగదీశ్వర్ ములుగుకు, భూపాలపల్లి డీపీ వో ఆర్.లత పెద్దపల్లికి, ములుగు డీఈవో కొండా వెంకయ్య మేడ్చల్ మల్కాజ్‌గిరికి, వీ నారాయణరావు భూపాలపల్లి డీపీ వోగా బదిలీ అయ్యారు.