జనగామ, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : జనగామ నియోజకవర్గ సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సోమవారం అసెంబ్లీలో గళమెత్తారు. జీరో అవర్‌లో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ధర్మసాగర్ రిజర్వాయర్ నాలుగు పంపులను వెంటనే ఆన్ చేస్తే ఎండిపోగా మిగిలిన 50 శాతం పంటలు దక్కుతాయని, మల్లన్నసాగర్ పనులు వెంటనే చేపట్టాలని కోరారు. నియోజకవర్గంలోని తపాస్‌పల్లి, కన్నెబోయినగూడెం, లద్నూ రు, బొమ్మకూరు, చీటకోడూరు, గండిరామారం రిజర్వాయర్ల ద్వారా 1.60 లక్షల ఎకరాలకు సాగు నీళ్లంది ఏటా రెండు పంట లు పండాయన్నా రు.
ఈ యాసంగికి మొదటిసారి 50 శాతం పంటలు ఎండి పోయాయ ని, మిగతావి చేతికొస్తాయో లేదో నమ్మకం లేదన్నా రు. సమ్మకసాగర్ బరాజ్ నుంచి భీంఘన్‌పూర్, చలివాగు ద్వారా దేవాదుల జలాలు ధర్మసాగర్‌కు చేరి అక్కడి నాలు గు మోటర్ల ద్వారా జనగామకు నీళ్లు వస్తాయన్నారు. నాలు గు మోటర్లలో ఒక్క దానిని నడుపుతుండడంతో పంటలు ఎండిపోయాయన్నారు. ధర్మసాగర్‌కు ఫేస్-1, ఫేస్-2 నుంచే కాకుండా అదనంగా ఫేస్-3 ద్వారా 1800 క్యూసెకుల నీళ్లు వచ్చేలా దేవన్నపేట వద్ద పంప్‌హౌస్ నిర్మాణం పూర్తయ్యిందన్నారు.
ఇందులో ఏ ర్పాటు చేసిన మూడు మోటర్లను ఆన్ చేయడానికి కష్టపడుతున్నారని అన్నారు. తపాస్‌పల్లికి పైన మల్లన్నసాగర్ ఉంద ని, గత సర్కారు హయాంలో రూ.350 కోట్ల నిధులిస్తే ఈ ప్రభుత్వం వచ్చాక పనులు ఆపేసిందని, వెంటనే చేపట్టి నీళ్లు ఇవ్వాలని, లేనిపక్షంలో ఎకరానికి రూ. 25 వేల పరిహారం రైతులకు చెల్లించాలని పల్లా డిమాండ్ చేశారు. అలాగే జనగామ, చేర్యాల ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పించాలని పల్లా ప్రభుత్వాన్ని కోరారు. జనగామ ఆస్పత్రిలో సీటీ సాన్ లేదని, ఇప్పటికే అసెంబ్లీ వేదికగా మూడుసార్లు ప్రభుత్వాన్ని కోరినా ఇవ్వలేదన్నారు. సానింగ్ కోసం వరంగల్, హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, జిల్లా ఆస్పత్రిలో మందులు, కనీస సౌకర్యాలు లేవన్నారు.