జనగామ, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : దేశంలో ఎకడా లేని విధంగా గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే దళితుల సమగ్రాభివృద్ధి జరిగిందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. దళిత బంధు పథకంతో పాటు కార్పొరేషన్ సబ్సిడీలు ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు ఆయన పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో గత ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన కారు ను సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కడవేర్గుకు చెందిన గదరాజు కనకయ్య కు అందజేశారు.
ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ దళితుల సంక్షేమానికి గ త ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేసిందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ముస్త్యాల బాల నర్స య్య, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గదరాజు చందు పాల్గొన్నారు.