హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 24: మహబూబ్నగర్ జిల్లాకు చెందిన 22 మంది తెలుగు సాహితీ వేత్తలు గురువారం హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను సందర్శించారు. వరంగల్లోని సాహిత్య కారుల జన్మ స్థలాలను, నివాస స్థలాలను సందర్శనలో భాగంగా ఆర్ట్స్ కళాశాల మొదటి ప్రిన్సిపాల్ ప్రముఖ సాహిత్యవేత ఆచార్య రాయపోలు సుబ్బారావు పనిచేసిన చోటును సందర్శించడం సంతోషంగా ఉందన్నారు. పాలమూరు జిల్లా నుంచి బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
సాహిత్యకారుల వెంట ఆర్ట్స్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ ఆచార్య బన్న ఐలయ్య, సాహితీ వేతలు రామశాస్త్రి, వీఆర్ విద్యార్థి ఉన్నారు. సాహితీ వేత్తలకు కళాశాల గొప్పతనాన్ని ఆచార్య బన్న ఐలయ్య తెలియజేశారు ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో మొట్టమొదటి విద్యా కేంద్రమైన ఆర్ట్స్ కళాశాల 100 సంవత్సరాల చరిత్ర కలిగిన చారిత్రాత్మకమైన విద్యాసంస్థ అని తెలియజేశారు. పాలమూరు సాహిత్యవేతలకు ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ రెహమాన్ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గిరి ప్రసాద్, డాక్టర్ ఆదిరెడ్డి, హరికుమార్ బోధ నేతర సిబ్బంది ఉన్నారు.