వడ్ల కొనుగోళ్ల రైతన్న బిజీ
ఎక్కడచూసినా ధాన్యం రాశులు
కల్లాల్లో వడ్ల కాంటాలు
దారుల వెంట వడ్ల వాహనాల బారులు
వరంగల్ : వరి కోతలు ముమ్మరమయ్యాయి. ఏ పొలం చూసినా హార్వెస్టర్‌తో పంట కోస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇక వడ్లను అక్కడే కాంటా పెట్టి ట్రాక్టర్లోనో, లారీలోనో లోడ్ చేసి హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటున్నారు. వానకాలం వస్తుండడంతో వరి కోయగా మిగిలిన గడ్డిని కట్టలుగా కట్టి ఎడ్లబండ్లలో ఎప్పటికప్పుడు తరలిస్తున్నారు.
దీంతో దారుల వెంట ధాన్యం బస్తాల లోడ్‌తో ఉన్న వాహనాలు బారులు తీరుతుండగా.. వడ్ల బస్తాలతో కల్లాలు కళకళలాడుతున్నాయి. ఇప్పుడు రైతులంతా ఇంటిల్లిపాది ధాన్యం కోతలు, కొనుగోళ్లతో బిజీగా ఉన్నారు. ఇలా కోతలు కోసి, కుప్పపోసి, కాంటాలు పెడుతున్న దృశ్యాలు హనుమకొండ జిల్లా వంగపహాడ్ పరిసర ప్రాంతాల్లో కనిపించాయి.