ఏటూరునాగారం : మండలంలో సోమవారం రాత్రి కురిసినభారీ వర్షానికి మిర్చి, వరి పంటకు తీరని నష్టం వాటిల్లింది. గాలి దుమారంతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం రావడంతో కల్లాలపై ఆరబోసిన మిర్చి తడిసి ముద్దయిపోయింది. వరి పంటకు తీవ్ర నష్టం జరిగింది. ధాన్యం నేలరాలటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఏటూరు నాగారం రొయ్యూరు, శంకరాజుపల్లి, చెల్పాక, రామన్నగూడెం రామ్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షంతో పంటలకు నష్టం వాటిల్లింది. అసలే మిర్చి పంటకు సరైన గిట్టుబాటు ధర లేక నష్టపోతుండగా అకాల వర్షం మరింత తమను వేదనకు చేసిందని రైతులు గుండెలు బాదుకుంటున్నారు. రైతులకు ప్రభుత్వం పంట నష్టం అందజేసి ఆదుకోవాలని వివిధ పార్టీల నాయకులు కోరారు.