లింగాల గణపురం : యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలని స్వచ్ఛంద సేవకుడు పి.రవి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో ఆదివారం మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ర్యాలీని చేపట్టారు. అనంతరం మానవ హారంగా ఏర్పడి..మత్తు పదార్థాలకు, మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడుతామని యువతచే ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ నేడు యువత మత్తు పదార్థాలకు బానిసలై బతుకులను బుగ్గి చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండి చదువులపై దృష్టి లక్ష్యాలను నెరవేర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీశైలం, ఏదునూరి వీరన్న, కెమిడి వెంకటేశం, రాగల్ల ఉపేందర్, కుంటి రామచందర్, చెన్నూరి మల్లేశం, ఉడుగుల భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.